
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 78


118 అంటే అర్థం అదే - నివేథా

శ్రీవాస్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్?

నివేదాకి హీరోగానూ కలిసొస్తాడా?

వారి మాటల్ని మరిచిపోలేను - నివేత థామస్

`యాత్ర` దర్శకుడితో దుల్కర్ సల్మాన్?

`మన్మథుడు` సీక్వెల్‌లో సమంత?

మణిరత్నం మూవీ లో కలెక్షన్ కింగ్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సాయేషా

7 మూవీ మార్చి నెలలో విడుదల

ఎన్.జి.కె టీజర్ రిలీజ్

మజిలీ మూవీ టీజర్ రిలీజ్

మొదలైన భారతీయుడు 2 షూటింగ్

అందులో నిజం లేదు - మేం క్లారిటీ ఇస్తాం
వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితంలో అతి కీలకమైన పార్ట్ ను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాతో అప్పటి ఘటనలను వెండి తెరపై చూపించనున్నాడు వర్మ. ఇక వర్మ ఎప్పుడైతే ఈసినిమా గురించి ప్రకటన చేశారో అప్పటి నుండి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. నిజానికి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు కంటే కూడా వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించే అందరిలో ఆసక్తి ఉంది.

118 అంటే అర్థం అదే - నివేథా
ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రేపు (మార్చి1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. దీనిలో భాగంగానే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నివేథా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అసలు 118 అంటే ఏంటి.. తన పాత్ర ఏంటో చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ మూవీలో బన్నీ సాంగ్
ప్రస్తుతం విశాల్ టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టెంపర్ సినిమా రీమేక్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో అయోగ్య పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రీమేక్ లో ఓ చిన్న చేంజ్ చేసినట్టు కనిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నోరా ఫతేహితో ఇట్టాగే రెచ్చిపోదాం స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో ఆ పాటను రిజెక్ట్ చేశారట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్టయిన బ్లాక్ బస్టర్ సాంగ్ ను పెట్టనున్నారట.. అది కూడా తెలుగులోనే. మరి ఎన్టీఆర్ మూవీలో బన్నీ సాంగ్ అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా…

శ్రీవాస్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్?
దాదాపు పుష్కరకాలం క్రితం విడుదలైన `లక్ష్యం` (2007) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు శ్రీవాస్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శ్రీవాస్‌కి... ఆ తరువాత వచ్చిన `రామరామ కృష్ణ కృష్ణ`, `పాండవులు పాండవులు తుమ్మెద` సినిమాలు ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో... తన తొలి చిత్ర కథానాయకుడు గోపీచంద్ కాంబినేషన్‌లోనే రూపొందించిన `లౌక్యం`తో మంచి కమర్షియల్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు శ్రీవాస్. అయితే... ఆ తరువాత వచ్చిన `డిక్టేటర్`, `సాక్ష్యం` చిత్రాలు నిరాశపరిచాయి.

నివేదాకి హీరోగానూ కలిసొస్తాడా?
`జెంటిల్ మన్`, `నిన్ను కోరి`, `జై లవ కుశ` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్. గ్లామర్ రోల్స్ కంటే పెర్‌ఫార్మెన్స్ రోల్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అందాల తార... దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆ చిత్రమే... `118`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రేపు (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు రానుంది.

వారి మాటల్ని మరిచిపోలేను - నివేత థామస్
సూపర్ హిట్ మూవీ జెంటిల్ మన్ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత థామస్ నటించిన నిన్నుకోరి, జై లవకుశ సినిమాలు ఘనవిజయం సాధించాయి. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో నివేత జంటగా నటించిన 118 మూవీ రిలీజ్ సందర్భంగా విలేఖరుల సమావేశం లో నివేత తన మనసులోని మాటల్ని వారితో పంచుకున్నారు.

`యాత్ర` దర్శకుడితో దుల్కర్ సల్మాన్?
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజేశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక ఘట్టం... పాదయాత్ర. ఈ పాదయాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం `యాత్ర`. సరిగ్గా 20 రోజుల క్రితం విడుదలైన `యాత్ర` సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి.రాఘవ్ రూపొందించిన ఈ సినిమా మలయాళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. మమ్ముట్టికి ఉన్న క్రేజ్‌తో కేరళలోనూ ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టుకుంది.

స‌్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వానంద్ తాజా చిత్రం
యంగ్ హీరో శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో శర్వానంద్‌కి జోడీగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ తొలిసారిగా నటిస్తున్నారు. కాగా... గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా... ఈ షెడ్యూల్ పూర్తయిందని సమాచారం. దీంతో... ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకున్నట్లేనని ఇన్‌సైడ్ సోర్స్ టాక్.

`మన్మథుడు` సీక్వెల్‌లో సమంత?
చెన్నై బ్యూటీ సమంత కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాలలో `మనం` ఒకటి. అందులో... రెండు విభిన్న పాత్రల్లో సామ్ అభినయం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా... కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో సమంత నటించిన సన్నివేశాలన్నీ అలరించేలా ఉంటాయి. `మనం`లో నాగ్‌కి తల్లి పాత్రలో కనిపించిన సామ్... ఆ తరువాత `రాజు గారి గది 2`లోనూ మరోసారి కలిసి నటించింది. అయితే... నాగచైతన్యని పెళ్ళాడాకా... నాగ్‌తో మళ్ళీ కలసి నటించని సామ్... అతి త్వరలో ముచ్చటగా మూడోసారి కలిసి నటించబోతోందని సమాచారం.

మణిరత్నం మూవీ లో కలెక్షన్ కింగ్
విభిన్న కథా చిత్రాలు రూపొందించే లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందించనున్నారు. రైటర్ కల్కి తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ను తెరకెక్కించనున్నారు. హిస్టారికల్ డ్రామా గా రూపొందనున్న ఈ మూవీలో నటించేందుకు విలక్షణ నటుడు, సీనియర్ హీరో మోహన్ బాబు ను సంప్రదించినట్టు, పలు భాషా నటులతో రూపొందే ఈ మూవీ కి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సాయేషా
అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయేషా సైగల్, వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో ఆర్య వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు మనందరికీ తెలిసిందే. మార్చి 9, 10 తేదీలలో వీరి వివాహం జరగనుందని.. హైదరాబాద్‌లో ఆర్య, సాయేషాల పెళ్లి వేడుక జరపనుండగా, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని అన్నారు.

వారం గ్యాప్‌లో వస్తున్న బాబాయ్, అబ్బాయ్
ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒక రోజు గ్యాప్‌లోనో లేదంటే వారం గ్యాప్‌లోనో రిలీజవడం టాలీవుడ్‌లో అప్పుడప్పుడు చోటు చేసుకునే వ్యవహారమే. ఈ సంక్రాంతికి ఒక రోజు తేడాతో మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలు `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2` విడుదలయ్యాయి. `వినయ విదేయ రామ`లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా... `ఎఫ్ 2`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.


నెల రోజుల గ్యాప్‌లో మూడు `మెగా` కాంపౌండ్ చిత్రాలు
మెగా కాంపౌండ్‌లో తారల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అందుకే... ఏడాది పొడవునా ఈ కాంపౌండ్ నుంచి కనీసం అరడజను నుంచి పది చిత్రాలైనా తెరపై వినోదాన్ని పంచుతూ మెగాభిమానులను మురిపిస్తున్నాయి. ఇక... ఈ ఏడాది వేసవిలో అయితే... ఏకంగా మూడు మెగా ఫ్యామిలీ మూవీస్ అభిమానుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలే `ఏబీసీడీ`, `సూర్యకాంతం`, `చిత్రలహరి`.

7 మూవీ మార్చి నెలలో విడుదల
కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాణ సారధ్యం లో సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకత్వంలో రెహమాన్, హవీష్, రెజీనా, నందిత శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిథా చౌదరి,అదితి ఆర్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలలో నటించగా 7 మూవీ రూపొందింది. ఆడవారి జీవితాలతో ఆడుకునే ఉమనైజర్ ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ నేపథ్యం లో రూపొందిన 7 మూవీ మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది.

ఎన్.జి.కె టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా రెండు లుక్స్ ను విడుదల చేయగా తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు.

మజిలీ మూవీ టీజర్ రిలీజ్
శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా టీజర్ ను విడుదల చేసింది.

మొదలైన భారతీయుడు 2 షూటింగ్
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దాంతో పలు రూమర్లు కూడా వినిపించాయి ఇటీవల. సినిమా ఆపేశారని.. షూటింగ్ ఆగిపోయిందని ఇలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక దానిపై కమల్ స్పందించి అలాంటిదేమీ లేదని క్లారిటీ కూడా ఇచ్చారు.