స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దాంతో పలు రూమర్లు కూడా వినిపించాయి ఇటీవల. సినిమా ఆపేశారని.. షూటింగ్ ఆగిపోయిందని ఇలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక దానిపై కమల్ స్పందించి అలాంటిదేమీ లేదని క్లారిటీ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరోసారి ఆ రూమర్లకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుండే చెన్నై లో మొదలైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అంతా విదేశాల్లో జరుపుకోనుండగా.. ఇక్కడ చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. మొత్తానికి సినిమా షూటింగ్ మొదలైంది. పుకార్లకు బ్రేక్ పడింది.
కాగా ఈసినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో చేయనున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం 2020లో సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది. మరి ఈ సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో చూద్దాం..
[youtube_video videoid=jA0xiSGBGQs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: