తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా రెండు లుక్స్ ను విడుదల చేయగా తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ను బట్టి చూస్తే సూర్య పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయన్న విషయం అర్దమైపోతుంది. సూర్య పాత్రకి సంబంధించి పూర్తి భిన్నమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేయడం వలన సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
కాగా ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. వారియర్ డ్రీమ్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. మరి గత ఏడాది దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. మరి ఈ ఏడాది ఎప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారో చూడాలి.
[youtube_video videoid=OJnztxKkNFk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: