మజిలీ మూవీ టీజర్ రిలీజ్

Majili Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Telugu Movie Teaser,Majili Teaser,Majili Movie Official Teaser,Naga Chaitanya and Samantha New Movie Majili Teaser,Majili Movie Latest Updates,#MajiliTeaser
Majili Movie Teaser Out Now

శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా టీజర్ ను విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను…ఈలోపు నువ్ సచినే అవుతావో సోంబేరివి అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ ను బట్టి చూస్తే తను క్రికెట్ ఆడే టైంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయితో విడిపోవడం.. ఆతరువాత సమంతను పెళ్లి చేసుకున్నట్టు అర్దమవుతోంది. అలాంటి పరిస్థితుల్లోనే ‘నువ్వు నా రూమ్ లోకి రాగలవేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేవు’ అంటూ సమంతతో చెప్పే డైలాగ్.. సమంత ఎమోషనల్ అవ్వడం హైలైట్ గా నిలిచాయి. మరి టీజర్ ను చూస్తే చైసామ్ మరోసారి హిట్ కొడతారేమో అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

కాగా శివ నిర్వాణ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ ప‌తాకంపై హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. పెళ్లి తరువాత ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రియల్ లైఫ్ రొమాంటిక్‌ జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఈసారి ఎలా అలరిస్తారో.

[subscribe]

[youtube_video videoid=AZCJEgCH5Pk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =