కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 68

Rana Daggubati Latest Movie To Have An Interesting Backdrop,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rana New Movie Updates,Actor Rana Next Movie News,Rana Next Film Have an Interesting Backdrop,Rana Da
సినిమా వార్తలు

ఎమ‌ర్జెన్సీ నేప‌థ్యంలో రానా `విరాట‌ప‌ర్వం`?

రానా న‌ట ప్ర‌స్థానం రాజ‌కీయ నేప‌థ్య చిత్రాల‌తోనే మొద‌లైంది. `లీడ‌ర్‌` (2010)లో యువ ముఖ్య‌మంత్రి అర్జున్ ప్ర‌సాద్‌గా పాత్ర‌లో ఒదిగిపోయిన వైనం... రానాకి న‌టుడిగా మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. క‌ట్ చేస్తే... 2017లో విడుద‌లైన మ‌రో రాజ‌కీయ నేప‌థ్య చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లోనూ జోగేంద్రగా మెస్మ‌రైజ్ చేశాడు రానా. ఈ రెండు చిత్రాలు స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌ను ద‌ర్ప‌ణం ప‌డుతూ తెర‌కెక్కిన సినిమాలు కాగా... ఈ సారి పిరియాడిక్ ట‌చ్ ఉన్న పొలిటిక‌ల్ మూవీలో న‌టించ‌బోతున్నాడట‌ రానా.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, 30 Years For Chiranjeevi Blockbuster Movie State Rowdy, 30 Years For Mega Chiranjeevi State Rowdy Movie, 30 Years For Mega Star State Rowdy, Chiranjeevi State Rowdy Movie Completes 30 Years, Chiranjeevi State Rowdy Movi
సినిమా వార్తలు

చిరంజీవి `స్టేట్ రౌడీ`కి 30 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ప‌లు రికార్డుల‌కు కేంద్ర బిందువు. ఆయ‌న న‌టించిన అనేక‌ చిత్రాలు రికార్డు స్థాయి విజ‌యాల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా... కొత్త రికార్డుల‌ను నెల‌కొల్పాయి. అలా... నైజాంలో రూ.కోటి వ‌సూళ్ళు చేసిన తొలి తెలుగు చిత్రంగా `స్టేట్ రౌడీ` అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డితో పాటు పి.శ‌శిభూష‌ణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. చిరంజీవికి జోడీగా రాధ‌, భానుప్రియ న‌టించిన ఈ చిత్రంలో శార‌ద‌, రావుగోపాల రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, త్యాగ‌రాజ‌న్‌, నూత‌న్ ప్ర‌సాద్ త‌దిత‌రులు…

Team TFNవాట్సాప్
Change In Arjun Suravaram Movie Release Date Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nikhil Arjun Suravaram Movie Gets a New Release Date,Arjun Suravaram Movie Release Date PostPoned,Arjun Surava
రిలీజ్ అప్‌డేట్

మళ్లీ మారిన అర్జున్ సురవరం రిలీజ్ డేట్

మొన్నటి వరకూ టైటిల్ విషయంలో ఇబ్బది పడ్డ నిఖిల్ సినిమా అర్జున్ సురవరం కు ఇప్పుడు రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు తప్పటంలేదు. రెండు రోజుల క్రితం మార్చి 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా మార్చుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఇక ఏప్రిల్ లో ఏలాగూ రిలీజ్ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలు ఏప్రిల్ ను బుక్ చేసుకున్నాయి. దీంతో ఈసినిమాను మే 1న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal To Work With Prabhas For Third Time?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal Next With Young Rebel Star Prabhas,Kajal To Pair Up With Prabhas Once Again,Kajal Aggarwal Rop
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్ 20లో కాజ‌ల్‌?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌... టాలీవుడ్ చంద‌మామ‌. అంతేకాదు... ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రికి క‌లిసొచ్చిన క‌థానాయిక‌. ముఖ్యంగా... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ `డార్లింగ్‌`(2010), `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌`(2011) చిత్రాల్లో నాయిక‌గా న‌టించ‌డ‌మే కాదు... రెండు ఘ‌న‌విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుని మ‌రీ వార్త‌ల్లో నిల‌చింది కాజ‌ల్‌. క‌ట్ చేస్తే... దాదాపు ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ ఉత్త‌రాది సోయ‌గం... ప్ర‌భాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంద‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Maharshi First Single Gets A Release Date,Telugu Filmnagar.Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Latest Updates,Mahesh Babu Maharshi Movie First Single Release Date Confirmed,Maharshi Telugu Movie Late
రిలీజ్ అప్‌డేట్

మహర్షి ఫస్ట్ సింగిల్ కి టైమ్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అలా అభిమానులను ఉత్సాహపరిచే ఓ అప్ డేట్ ఇచ్చాడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్.

TFN Adminవాట్సాప్
స్పెషల్

పరాజయాల బాట నుండి విజయాల వేటలో టాలీవుడ్ హీరోలు

ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. సినిమా రంగంలో మరింత సహజం. దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ఇలా ఎవరిని తీసుకున్నా వరుస విజయాల ట్రాక్ రికార్డ్ ఎవరికీ ఉండదు. ఒక హిట్ వస్తే వరుసగా నాలుగు ఫ్లాపులు మీద పడిపోవడం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవమే. వరుస విజయాలు సాధించడం దాదాపుగా ఎవరికీ సాధ్యం కాదు. కెరీర్ ప్రారంభ దశలో ఎవరికైనా వరుస విజయాలు వస్తే వచ్చి ఉండవచ్చు కానీ అవి శాశ్వతంగా కొనసాగిన చరిత్ర ఎవరికీ లేదు... ఉండదు కూడా. కాబట్టి వరుస విజయాలు, వరుస పరాజయాలు ఎవరికి ఉండవు. విజయాల సంఖ్య తక్కువ అపజయాల సంఖ్య ఎక్కువగా ఉండటం సినిమా ప్రపంచం లో సర్వసాధారణం. ఇప్పటివరకు తమ కెరీర్లో ప్లాపుల కన్నా హిట్స్ ఎక్కువ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ, రాజశేఖర్ మల్టీస్టారర్ పై క్లారిటీ

నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కబోతున్నట్టు గత కొద్దిరోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ వేద. తమిళంలో తెరకెక్కిన ఈసినిమా 2017 లో విడుద‌లైన సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

TFN Adminవాట్సాప్
ఈసారి ట్రాక్ తప్పితే కష్టమే
సినిమా వార్తలు

ఈసారి ట్రాక్ తప్పితే కష్టమే

సొంతం, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ తన కామెడీ టైమింగ్ తో చంపేసిన సినిమాలు లిస్ట్ పెరుగుతూపోతుంది. గోదారోళ్లకి కాస్త ఎటకారం ఎక్కువ అన్నట్టు... ఆ ఎటకారం మొత్తం తన పంచ్ డైలాగుల్లోనే కనిపించేట్టు పంచులు వేయడంలో.. ఓ డిఫరెంట్ వాయిస్ తో కామెడీ చేయడంలో సునీల్ రూటే సెపరేటు.

TFN Adminవాట్సాప్
Varun Valmiki Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej Valmiki Movie Shooting News,Valmiki Movie Shooting Schedule,Varun Tej Valmiki Movie Shoot,Valmili Telugu Movie Update
షూటింగ్ అప్‌డేట్

వరుణ్ వాల్మీకి షూటింగ్ అప్ డేట్

వరుస హిట్లతో కెరీర్ లో దుసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ రీమేక్ వాల్మీకి సినిమాలో వరుణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ తేజ్ వచ్చే నెల అంటే ఏప్రిల్ 16వ తేదీ నుండి పాల్గొననున్నాడట. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటివ్ రోల్ లో చేయనున్నాడు.

TFN Adminవాట్సాప్
AKhil Akkineni New Movie Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,AKhil Akkineni Next Film News,Hero AKhil New Movie Updates,AKhil Next Project Details,AKhil Upcoming Movies,Latest Updates on Akh
సినిమా వార్తలు

మే మొద‌టి వారం నుంచి అఖిల్ చిత్రం?

`అఖిల్‌`, `హ‌లో`, `Mr. మ‌జ్ను` చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్‌... ప్ర‌స్తుతం త‌న నాలుగో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న్యూ ఏజ్ రొమాంటిక్‌-కామెడీ ఫిల్మ్‌గా తెర‌కెక్కనున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించ‌నుంది. ఇందులో అఖిల్‌కి జోడీగా `భ‌రత్ అనే నేను`, `విన‌య విధేయ రామ‌` చిత్రాల నాయిక కియ‌రా అద్వాని న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Bellamkonda Srinivas and Ajay Bhupathi Movie Gets A Launch Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bellamkonda Srinivas and Ajay Bhupathi New Movie News,Bellamkonda Srinivas and Ajay Bhupathi Film
సినిమా వార్తలు

బెల్లంకొండ - అజ‌య్ భూప‌తి సినిమాకి ముహుర్తం కుదిరిందా?

`ఆర్ ఎక్స్ 100` వంటి సంచ‌ల‌న చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. మొద‌టి సినిమాతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఘ‌న‌విజ‌యాన్ని కూడా త‌న ఖాతాలో న‌మోదు చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌. ప్ర‌స్తుతం త‌న రెండో సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు అజ‌య్‌. తొలి చిత్రం త‌ర‌హాలోనే త‌న మ‌లి సినిమాని కూడా రా స‌బ్జెక్ట్‌తోనే తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Chikati Gadilo Chithakotudu Movie 1st Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chikati Gadilo Chithakotudu Movie 1st Day Box Office Collections,Chikati Gadilo Chithakotudu Movie First Da
బాక్సాఫీస్

చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ డే కలెక్షన్స్

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్ అరుణ్ హీరోగా తెరకెక్కిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా నిన్న మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు విశాల్, మోహన్ లాల్ నటించిన పులిజూదం సినిమా కూడా రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Star Director As Arjun Reddy Father,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Star Director To Act in Arjun Reddy Movie Remake,Director Gautham Menon as Arjun Reddy Father,Gautham Menon To Feature in Arj
సినిమా వార్తలు

తమిళ్ అర్జున్ రెడ్డికి తండ్రిగా స్టార్ డైరెక్టర్

సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాను తమిళ్ లో కూాడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తనయుడు దృవ ఈ రీమేక్ లో నటిస్తుండగా ఇటీవలే రెండోసారి మళ్లీ సినిమాను షూట్ చేస్తున్నారు. మొదట బాల దర్శకత్వంలో సినిమాను తీయగా.. అవుట్ పుట్ సరిగా రాలేదని నిరాశ చెందిన నిర్మాతలు మళ్లీ రీ షూట్ చేస్తున్నారు. ధృవ‌ మిన‌హా అంద‌రు నటీనటులను, ద‌ర్శ‌కుడు బాల‌ను సైతం మార్చి తిరిగి షూటింగ్ ప్రారంభించారు.. ఈ కొత్త వెర్ష‌న్ కు గిరిసాయి ద‌ర్శ‌కుడు. బ‌నితా సంధూ హీరోయిన్. అంతేకాదు వర్మ టైటిల్ ను కూాడా…

TFN Adminవాట్సాప్
Vinara Sodara Veera Kumara Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Vinara Sodara Veera Kumara Movie Review,Vinara Sodara Veera Kumara Telugu Movie Revi
సినిమా వార్తలు

వినరా సోదర వీర కుమారా మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Payal Rajput As Special Attraction For Sita Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Payal Rajput To Act in Sita Movie,Payal Rajput Special Song in Sita Movie,Actress Payal Rajput New Movie News,
సినిమా వార్తలు

`సీత‌`లో పాయ‌ల్ నృత్యాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానున్నాయా?

పాయ‌ల్ రాజ్‌పుత్‌... గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన `ఆర్ ఎక్స్ 100`తో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా ఎదిగిన వ‌ర్థ‌మాన తార‌. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉందీ ఉత్త‌రాది భామ‌. ఓవైపు రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో న‌టిస్తూనే... మ‌రో వైపు `వెంకీమామ‌`లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌కి జోడీగా న‌టిస్తోంది. అలాగే... `మ‌న్మ‌థుడు 2`లో కింగ్ నాగార్జునకి జోడీగా ఇద్ద‌రు నాయిక‌ల‌లో ఒక‌రిగా న‌టించనుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
Actress Tabu Roped In For Allu Arjun Trivikram Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Tabu Next With Allu Arjun Movie,Actress Tabu To Act in Allu Arjun New Movie,Stylish Star Allu Arjun
సినిమా వార్తలు

బ‌న్నీ చిత్రంలో ట‌బు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి `నాన్న నేను` అనే పేరు ప్ర‌చారంలో ఉంది. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Signs A Bollywood Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Next Film News,Keerthy Suresh Next in Bollywood Movies,Actress Keerthy Sure
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో కీర్తి సురేష్

టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర కధానాయిక గా వెలుగొందుతున్న అందం, అభినయం కలబోసిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను శైలజ, మహానటి మూవీస్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మూవీస్ ను ఏ భాషలోనైనా ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగు లో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కీర్తి సురేష్ నటిస్తున్న 20వ మూవీ.

Team TFNవాట్సాప్
Latest Update about Kalyan Ram New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Kalyan Ram New Movie Update,Kalyan Ram Next Film News,Hero Kalyan Ram Upcoming Movies,Kalyan Ram Next Project Deta
సినిమా వార్తలు

క‌ళ్యాణ్ రామ్ `తుగ్ల‌క్‌` అప్‌డేట్‌

`118`తో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు క‌థానాయ‌కుడు నంద‌మూరి కళ్యాణ్ రామ్‌. ప్ర‌స్తుతం... ఈ టాలెంటెడ్ హీరో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. సోషియో ఫాంట‌సీ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా... ఈ సినిమాకి `తుగ్ల‌క్‌` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ సినిమాని మే నుంచి ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Mohan Babu Gets House Arrested,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Actor Mohan Babu House Arrest in Tirupati,Actor Mohan Babu Latest News,Mohan Babu Fires on AP Government For Fee Reimbur
బాక్సాఫీస్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హౌస్ అరెస్ట్ ?

1993 సంవత్సరం లో నటుడు, నిర్మాత మోహన్ బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి లో శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ విద్యా నికేతన్ ట్రస్ట్ లోని పలు కాలేజీలు విద్య ను అందిస్తున్నాయి. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ రోజు ర్యాలీ కి మోహన్ బాబు పిలుపు నిచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్