పాయల్ రాజ్‌పుత్… గత ఏడాది సంచలన విజయం సాధించిన `ఆర్ ఎక్స్ 100`తో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన వర్థమాన తార. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉందీ ఉత్తరాది భామ. ఓవైపు రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తూనే… మరో వైపు `వెంకీమామ`లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి జోడీగా నటిస్తోంది. అలాగే… `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి జోడీగా ఇద్దరు నాయికలలో ఒకరిగా నటించనుందని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… క్రేజీ ప్రాజెక్ట్ `సీత`లోనూ పాయల్ సందడి చేయనుంది. అయితే… కథానాయికగా కాదు. ఓ ప్రత్యేక గీతంలో పాయల్ కనువిందు చేయనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పాటకి పాయల్ నృత్యాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. కథలో భాగంగా వచ్చే ఈ గీతంలో చిత్ర నాయకానాయికలు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌తో పాటు పాయల్ కూడా కనిపిస్తుందని… తొలిసారిగా ప్రత్యేక గీతం చేస్తున్న పాయల్‌కి ఈ పాట గుర్తుండిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 25న తెరపైకి రానున్న `సీత`కి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
[youtube_video videoid=I3kOR4Nlixg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: