
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 69


జెస్సీ కి సూపర్ రెస్పాన్స్

'విలన్' పాత్రలపై ఇంట్రెస్ట్ చూపుతున్న హీరోలు

మరో కొత్త సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్

మన్మథుడు-2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్

`క్వీన్` రీమేక్ కోసం అమితాబ్ గానం?

పులిజూదం మూవీ మౌత్ టాక్

మరో సీక్వెల్‌లో నాగార్జున?

`మజిలీ`తో తమన్ రిపీట్ చేస్తాడా?

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ మౌత్ టాక్

మరోసారి సూపర్ స్టార్‌తో శంకర్?

లిసా ట్రైలర్ రిలీజ్

తమ్ముడికి అండగా బరిలో దిగిన నాగబాబు

ఐరా ట్రైలర్ రిలీజ్

హిప్పీ టీజర్ రిలీజ్

ఆది పినిశెట్టి కొత్త సినిమా ప్రారంభం

చరణ్ చేసిన పనికి షాకయ్యా

అక్షర సినిమా నుండి అసురులదర సాంగ్ రిలీజ్
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రస్తుతం ప్రేమ కథా చిత్రమ్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ కు సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. దానితో పాటు నందిత అక్షర్ అనే మరో థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.

పులిజూదం తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే తెలుగు నేటివిటీ లేకపోవడంతో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పలేం. కానీ..క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

జెస్సీ కి సూపర్ రెస్పాన్స్
రామ్ గోపాల్ వర్మ సినిమా 'దెయ్యం' నుండి ప్రస్తుతం వస్తున్న హార్రర్ సినిమాల వరకూ మనం ఎన్నో హార్రర్ మూవీస్ చూసి ఉంటాం. ఈనేపథ్యంలో హార్రర్ సినిమాలు అంటే మన మైండ్ లో కొన్ని ఎలిమెంట్స్ ఫిక్స్ అయి పోయి ఉంటాయి. ఒక ఇల్లు, అందులో దెయ్యం.. ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్లని ఆ దెయ్యం ఆడుకోవడం.. లేక వాళ్లకి దెయ్యం ఆవహించటం.. మ్యాగ్జిమమ్ ఇవే ఉంటాయి. ఇక ఇదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను అటు తిప్పి ఇటు తిప్పి హార్రర్ సినిమా అని తీసి బొక్క బోర్లా పడుతున్నారు కొంతమంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ ఫార్ములాను దాటి కాస్త బయటకు వచ్చి వైవిద్యం చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా ప్రయత్నించిన సినిమానే రీసెంట్ గా రిలీజైన…

చీకటి గదిలో చితక్కొట్టుడు తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలీస్ చూసే సినిమా కాదని చెప్పొచ్చు. హార్రర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చూడొచ్చు. యూత్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుంది.

'విలన్' పాత్రలపై ఇంట్రెస్ట్ చూపుతున్న హీరోలు
విలన్ 'హీరో' అయ్యాడు... విలన్ హీరో అవ్వడం ఏంటబ్బా అనుకుంటున్నారా..? ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న చిన్నగా నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఇన్ని రోజులు హీరోలుగా హీరోయిజం చూపించి.. చూపించి మన హీరోలకు బోర్ కొట్టిందేమో తెలియదు కానీ విలన్ పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న థోరణికి స్వస్తి పలికి.. నేటి విలన్లు కూడా హీరోల్లాగా మేకోవర్ అవుతున్నారు. కొన్ని కొన్ని సినిమాల్లో అయితే హీరోల కంటే విలన్లే ఎక్కువ హ్యాండ్ సమ్ గా ఉంటున్నారు. దీనిలో భాగంగా తమలో ఉన్న నెగిటివ్ యాంగిల్ ను కూడా చూపించుకోవడానికి మంచి అవకాశం ఉండటంతో హీరో లు కూాడా…

మరో కొత్త సినిమాకు నితిన్ గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడు. ఏడాదికి ఒక సినిమాకే ఫిక్స్ అవ్వకుండా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ లిస్ట్ లో భీష్మ సినిమా ఉంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సైట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

మన్మథుడు-2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, ధృవ, రా రండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ మూవీ తరువాత టాలీవుడ్ కు దూరమయ్యారు. హిందీ, తమిళ మూవీస్ లో బిజీగా మారారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు లో శ్రీదేవి గా అతిథి పాత్రలో నటించి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో బిజీగా మారుతున్నారు.

`క్వీన్` రీమేక్ కోసం అమితాబ్ గానం?
అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. నటనకు పర్యాయపదంలా నిలచిన ఈ నటగ్రంథం... ఈ ఏడాదితో 50 వసంతాల సినీ ప్రయాణం పూర్తిచేసుకుంటున్నారు. కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా... దక్షిణాది తెరపైనా తనదైన సంతకం చేశారాయన. అలాంటి అమితాబ్ కేవలం నటుడిగానే కాదు... గాయకుడిగానూ పలు జనరంజక గీతాలను ఆలపించారు. ఆయన పాడిన కొన్ని పాటలైతే... ఆ యా చిత్రాల విజయాల్లో భాగం కూడా అయ్యాయి. ఇప్పుడు మరోసారి తన గాత్రాన్ని సవరించుకోనున్నారు బిగ్ బి. అయితే... ఈ సారి హిందీ సినిమా కోసం కాదు... హిందీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న దక్షిణాది…

బాలకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్?
ప్రస్తుతం తెలుగునాట మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పుడు ఇదే వరుసలో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేరనుందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే... 2017 జూలై 21న విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం `విక్రమ్ వేద`. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని పుష్కర్ - గాయత్రి తెరకెక్కించారు. ఐఎండిబిలో అత్యధిక రేటింగ్స్ అందుకున్న ఈ తమిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పులిజూదం మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

మరో సీక్వెల్‌లో నాగార్జున?
`దేవదాస్` తరువాత మరో తెలుగు చిత్రం చేయని కింగ్ నాగార్జున... అతి త్వరలో రెండు చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడం విశేషం. అందులో ఒకటి `మన్మథుడు` (2002)కి సీక్వెల్ కాగా... మరొకటి `సోగ్గాడే చిన్ని నాయనా` (2016)కి కొనసాగింపు చిత్రం. ఈ రెండు సినిమాలను కూడా నాగార్జున స్వయంగా నిర్మించనున్నాడు. ఇదిలా ఉంటే... మరో సీక్వెల్‌లోనూ నాగార్జున నటించబోతున్నట్లు టాలీవుడ్ టాక్.

`మజిలీ`తో తమన్ రిపీట్ చేస్తాడా?
పెళ్ళయ్యాక యువ జంట అక్కినేని నాగచైతన్య, సమంత జోడీగా నటిస్తున్న తొలి చిత్రం `మజిలీ`. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం పాటలకు మాత్రమే గోపీ పరిమితం కాగా... బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం యువ సంగీత సంచలనం తమన్ అందించనున్నాడు.

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

మరోసారి సూపర్ స్టార్‌తో శంకర్?
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అచ్చొచ్చిన దర్శకులలో ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `శివాజీ` (2007), `రోబో` (2010), `2.0` (2018) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి... ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రజినీ, శంకర్ మధ్య సంప్రదింపులు జరిగాయని... త్వరలోనే ఈ కాంబో మూవీపై క్లారిట్ వస్తుందని సమాచారం.

లిసా ట్రైలర్ రిలీజ్
గీతాంజలి, చిత్రాంగథ చిత్రాలతో మెప్పించిన అంజలి మరోసారి అదే జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో లిసా అనే సినిమా రూపొందుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పూరీ జగన్నాథ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

తమ్ముడికి అండగా బరిలో దిగిన నాగబాబు
తన సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చూపడానికి రెడీ అయ్యాడు. సొంతగా జనసేన పార్టీ పెట్టి.. ప్రజారాజ్యం పార్టీలాగ కాకుండా తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ప్రత్యర్థులు పెద్దగా పట్టించుకోని పార్టీనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటేనే అర్దం చేసుకోవచ్చు పవన్ పార్టీ సాధించిన ప్రభంజనం ఏంటో. ఇదే జోరుతో రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీల పొత్తుతో ఎన్నికల బరిలో దిగనున్నాడు పవన్.

ఐరా ట్రైలర్ రిలీజ్
వరుస హిట్లతో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. లేడి ఒరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇటీవలే అంజలి సి.బి.ఐ సినిమాతో మంచి హిట్ అందుకున్న నయన్ ఇప్పుడు ఐరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డార్క్ కలర్ తో నయనతార ఈ సినిమాలో మరో ప్రయోగం చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

హిప్పీ టీజర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో సన్సేషనల్ హీరోగా మారిన కార్తికేయ ఈసారి 'హిప్పీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో హిప్పీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచాయి. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఆది పినిశెట్టి కొత్త సినిమా ప్రారంభం
హీరో, విలన్, క్యారెక్టర్ ఇలా ఏ పాత్ర అయినా ఇచ్చినా సరే చేయగలిగిన నటుల్లో ఆది పినిశెట్టి కూాడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సరైనోడు సినిమాలో విలన్ గా.. రంగస్థలం సినిమాలో కుమార్ బాబు క్యారెక్టర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.. అలా ఆది లో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో అటు విలన్ పాత్రలను .. కీలకమైన పాత్రలను చేస్తూనే, మరోవైపున హీరోగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుండూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

చరణ్ చేసిన పనికి షాకయ్యా
నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ. ఇంతకీ బ్రహ్మాజీ అంత హ్యాపీగా ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నారా? అసలు కారణం ఏంటంటే.. సైరా సినిమాలో నటించడమే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ సైరా సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవితో నటించడంతో తన డ్రీమ్ నిజమైందని చెబుతున్నాడు. అంతేకాదు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.