సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాను తమిళ్ లో కూాడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తనయుడు దృవ ఈ రీమేక్ లో నటిస్తుండగా ఇటీవలే రెండోసారి మళ్లీ సినిమాను షూట్ చేస్తున్నారు. మొదట బాల దర్శకత్వంలో సినిమాను తీయగా.. అవుట్ పుట్ సరిగా రాలేదని నిరాశ చెందిన నిర్మాతలు మళ్లీ రీ షూట్ చేస్తున్నారు. ధృవ మినహా అందరు నటీనటులను, దర్శకుడు బాలను సైతం మార్చి తిరిగి షూటింగ్ ప్రారంభించారు.. ఈ కొత్త వెర్షన్ కు గిరిసాయి దర్శకుడు. బనితా సంధూ హీరోయిన్. అంతేకాదు వర్మ టైటిల్ ను కూాడా మార్చేసి అదిత్య వర్మ గా కొత్త టైటిల్ ను ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ధృవ తండ్రి పాత్ర కోసం ఓ స్టార్ డైరెక్టర్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ధృవ తండ్రి పాత్ర కోసం కొంతమంది నటుల పేర్లను పరిశీలించారట దర్శకనిర్మాతలు.. అయితే కొత్తదనం కోసం ఆ పాత్రకి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[youtube_video videoid=EVrgWqwbdIE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: