వరుణ్ వాల్మీకి షూటింగ్ అప్ డేట్

Varun Valmiki Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej Valmiki Movie Shooting News,Valmiki Movie Shooting Schedule,Varun Tej Valmiki Movie Shoot,Valmili Telugu Movie Updates,Varun Tej New Movie Valmiki Shooting
Varun Valmiki Movie Latest Update

వరుస హిట్లతో కెరీర్ లో దుసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ… నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ రీమేక్ వాల్మీకి సినిమాలో వరుణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ తేజ్ వచ్చే నెల అంటే ఏప్రిల్ 16వ తేదీ నుండి పాల్గొననున్నాడట. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటివ్ రోల్ లో చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ప్రస్తుతం వరుణ్ ఈసినిమాతో పాటు నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఏకంగా ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. థ్రిల్లింగ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ట్రైనింగ్ పూర్తయిన తరువాత వరుణ్ తేజ్ వాల్మీకి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతాయో? లేదో? చూడాలి…

[subscribe]

[youtube_video videoid=kx20Cf63drM]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + two =