వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అలా అభిమానులను ఉత్సాహపరిచే ఓ అప్ డేట్ ఇచ్చాడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్ని రోజులు కేవలం షూటింగ్ అప్ డేట్స్ మాత్రమే రాగా.. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ నెల మార్చి 29వ తేదీన ఈ సినిమా నుండి ఫస్ట్ పాటను రిలీజ్ చేయనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా దేవి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
So..4 all those waiting 4 d updates of #MAHARSHI ..
1st SINGLE is on 29th MARCH !!😁🎹#MAHARSHI1stSINGLEonMARCH29th
Till then Enjoy this Cute Video of these Cute Junior… https://t.co/26tozswBsG
— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 23, 2019
ఇక ఇటీవలే చెన్నై షెడ్యూల్ ను కూాడా పూర్తి చేసుకున్న మహర్షి మరి కొద్ది రోజులలోనే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టగా.. అవి కూాడా త్వరగానే పూర్తి చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనుంది. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
[youtube_video videoid=Brd1RdYsiR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: