స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి `నాన్న నేను` అనే పేరు ప్రచారంలో ఉంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బన్నీ తల్లి పాత్రలో నిన్నటి తరం కథానాయిక టబు ఎంపికయ్యిందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి… ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ నగ్మా నటించబోతోందని ఆ మధ్య కథనాలు వచ్చినా… తనని ఎవరూ సంప్రదించలేదని నగ్మా తెలిపింది. ఇప్పుడదే పాత్రలో టబు నటించబోతోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలోనే టబు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా… ఈ సినిమా కోసం బన్నీ బాగా స్లిమ్ లుక్‌లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బరువు తగ్గడంపై ఈ యంగ్ హీరో దృష్టి పెట్టాడని తెలుస్తోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న బన్నీ-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ… ఈ ఏడాది చివరిలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: