`అఖిల్`, `హలో`, `Mr. మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అక్కినేని అఖిల్… ప్రస్తుతం తన నాలుగో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ రొమాంటిక్-కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇందులో అఖిల్‌కి జోడీగా `భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాల నాయిక కియరా అద్వాని నటించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అంతేకాదు… ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి… సంవత్సరాంతంలో సినిమాని విడుదల చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. `బొమ్మరిల్లు`, `పరుగు` తరువాత సరైన విజయాలు లేని భాస్కర్‌కి… అలాగే కథానాయకుడిగా ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేకపోయిన అఖిల్‌కి ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: