
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 44


రవితేజ ‘కిక్’కి పదేళ్ళు

డబుల్ బొనాంజా ఇవ్వనున్న తమన్నా

ఆగస్టు నుంచి వరుణ్‌తేజ్ స్పోర్ట్స్ డ్రామా?

జూన్ నుంచి అఖిల్ తదుపరి చిత్రం షూటింగ్?

మహర్షి సూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్

మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్

ఆ రీమేక్ చేయట్లేదు ఫేక్ న్యూస్

స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో ఆది పినిశెట్టి

హిప్పీ మూవీ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కొడతాడా?

ఇంద్రగంటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "V"

నానికి ఎమోషన్స్ లేవా?

భారీ స్థాయిలో మహర్షి బుకింగ్స్

మహర్షి మూవీ కై బాలీవుడ్ ఎదురుచూపులు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహేష్ బాబు 3షేడ్స్ లో నటించిన మహర్షి మూవీ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం లో 400 స్క్రీన్స్ లో, నైజాం లో 110 స్క్రీన్స్ లో ఈ మూవీ రిలీజ్ కావడం రికార్డ్.

`మహర్షి`కి `దిల్` రాజు `బెస్ట్ కపుల్` సెంటిమెంట్
కొన్ని జంటలు వెండితెరపై మ్యాజిక్ చేస్తాయి. వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరి విజయం సాధిస్తే… ఆ జంటను పదే పదే చూడాలని ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో… అలాగే అలాంటి జంటలను వారి సినిమాల్లో కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని దర్శక, నిర్మాతలకూ అనిపిస్తూ ఉంటుంది. అలా… ప్రేక్షకులు మెచ్చిన జంటల్లో ప్రకాష్ రాజ్, జయసుధ జోడీ ఒకటి కాగా… వారిని తన సినిమాల్లో పదే పదే రిపీట్ చేసి విజయాలు సాధించిన నిర్మాత టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు.

రవితేజ ‘కిక్’కి పదేళ్ళు
ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన హీరోల్లో మాస్ మహరాజా రవితేజ ఒకరు. వినోదానికే పెద్ద పీట వేసే రవితేజ… పలు యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అటువంటి ఎంటర్‌టైనర్‌లలో ‘కిక్’ ఒకటి. నలుగురికి మంచి చేయడంలో ఉండే కిక్... మరెందులోనూ ఉండదనే ఇతివృత్తంతో ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించాడు. రవితేజకి జోడీగా ఇలియానా నటించిన ఈ చిత్రంలో షాయాజీ షిండే, ప్రభ, బ్రహ్మానందం, శ్యామ్, రావు రమేష్, జయప్రకాష్ రెడ్డి, అలీ, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమాలోని…

డబుల్ బొనాంజా ఇవ్వనున్న తమన్నా
ఈ ఏడాది సంక్రాంతికి సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఎఫ్ 2’. ఇందులో హారికగా మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఈ నెలలో ఒకే రోజున రెండు హారర్ మూవీస్‌తో సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అందులో ఒకటి బైలింగ్వల్ మూవీ ‘అభినేత్రి 2’ కాగా.. మరొకటి హిందీ చిత్రం ‘ఖామోషి’.

ఆగస్టు నుంచి వరుణ్‌తేజ్ స్పోర్ట్స్ డ్రామా?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్-2’తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకితో బిజీగా ఉన్నాడీ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అంతేకాదు… ఈ సినిమా విడుదలయ్యే లోపు మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు వరుణ్.

జూన్ నుంచి అఖిల్ తదుపరి చిత్రం షూటింగ్?
‘అఖిల్’, ‘హలో’ చిత్రాలతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఇటీవల ‘మిస్టర్ మజ్ను’తో పలకరించిన ఈ యంగ్ హీరోకి… కెరీర్‌లో ఇంతవరకు ఆశించిన విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో… సాలిడ్ హిట్ కోసం అఖిల్ ఈ సారి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - 5 షోలకు గ్రీన్ సిగ్నల్
మహేష్ బాబు అభిమానులకు మరో గుడ్ న్యూస్ లభించింది తెలంగాణ ప్రభుత్వం ద్వారా. ఇప్పటికే సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు ‘మహర్షి’ బుకింగ్స్ కి ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పెట్టేశాయి. ఇక ఈనేపథ్యంలో ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కు దృష్టిలో పెట్టుకొని ఐదు షోలకు అనుమతి ఇవ్వాలని కోరగా.. తెలంగాణ ప్రభుత్వం 5 షోలు వేసుకోవటానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభిమానులు తెలంగాణ ప్రభుత్వంపై హర్షం చేస్తున్నారు.

మహర్షి సూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఇంకా కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది మహర్షి సినిమా రిలీజ్ కు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై హైప్ కూడా బాగా పెంచుతున్నారు చిత్రయూనిట్. దానికి తోడు ఇటీవల విడలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగిందని సమాచారం. ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో రూ. 50 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. మరి ఏయో ఏరియాలో మహర్షి…

మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్
మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో అప్పుడు చిరు - ఇప్పుడు పవన్
మొత్తానికి ఇంటర్నెేషనల్ డ్యాన్స్ షోలలో కూడా మన తెలుగు పాటలు సత్తా చాటుతున్నాయి. అది కూడా మెగా హీరోల పాటలు.. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలే కావడం ఆశ్చర్యకరమైన విషయం. గతంలో ఓ అమెరికన్ డ్యాన్స్ షో లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబరు 150’లోని ‘సుందరి..’ పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ పాట వంతైంది. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’లోని ‘వాడెవడన్నా..’ పాటకు అంతర్జాతీయ డ్యాన్స్ స్టేజీపైన ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు మధ్యలో బాహుబలి మ్యూజిక్ ను కూడా వాడుకున్నారు.

ఆ రీమేక్ చేయట్లేదు ఫేక్ న్యూస్
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలా పాత తరం కథానాయకులు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తీసి సంచలన విజయాలు సాధించారు. అయితే వారి తరం వచ్చిన నాయకుల్లో మళ్లీ మల్టీస్టారర్లకు ప్రాణం పోసిందంటే విక్టరీ వెంకటేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ మాత్రం సంకోచించకుండా మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీస్టారర్ సినిమా తీసి మరోసారి మల్టీస్టారర్ సినిమాలను గుర్తు చేశాడు. ఇక ఆ తరువాత ఇప్పుడు మళ్లీ అందరూ అదే బాట పట్టారనుకోండి.

స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో ఆది పినిశెట్టి
భారతీయ చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ నేపథ్యంలో మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యం లో రూపొందిన నాగ చైతన్య మజిలీ, నాని జెర్సీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆది పినిశెట్టి రన్నింగ్ క్రీడాకారుడిగా నటించనున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో రూపొందే స్పోర్ట్స్ డ్రామా మూవీ కి ఆది పినిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన కలను నెర వేర్చుకొనడానికి ఎదురైన అడ్డంకులను హీరో ఎలా అధిగమించాడు అనేది చిత్ర కథ.

హిప్పీ మూవీ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ, TN కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన హిప్పీ మూవీ ట్రైలర్ ను మే 9 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది.V క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కలైపులి S థాను నిర్మించిన హిప్పీ మూవీ కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా రూపొందింది. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక కీలక పాత్రలోనటించారు.

దర్శకుడిగా ఒకటిన్నర దశాబ్దం పూర్తిచేసుకున్న సుకుమార్
ఇన్నోవేటివ్ థాట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ఈ జనరేషన్ డైరెక్టర్ సుకుమార్. తొలి చిత్రం ఆర్యనుంచి గత చిత్రం ‘రంగస్థలం’ వరకు తనది అదే బాణి. అంతేకాదు… రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుక్కు. అందుకే 15 ఏళ్ళ దర్శక ప్రస్థానంలో కేవలం 7 చిత్రాలకే పరిమితమయ్యాడు. తన ఆలోచనలకి తెర రూపమిస్తూ నవ్య రీతిలో సుకుమార్ రూపొందించిన ప్రతీ సినిమా… యూత్‌ని మెస్మరైజ్ చేసింది.

కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా సి.కల్యాణ్ నిర్మాణంలో గత ఏడాది వచ్చిన 'జైసింహా' ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ కె.ఎస్ రవి కుమార్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ముందు బోయపాటితో సినిమా అంటూ వార్తలు వచ్చినా… ఆ తరువాత కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్ లోనే తన సినిమా ఉండబోతుందని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కొడతాడా?
నందమూరి బాలకృష్ణకు, సంక్రాంతి పండగకు విడదీయరాని అనుబంధముంది. బాలయ్య నటించిన పలు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలై… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. అందుకే… తనకి బాగా అచ్చొచ్చిన ఈ సీజన్‌లోనే.. తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’(2017)తో పలకరించి ఘనవిజయం అందుకున్నాడు బాలయ్య. ఇప్పుడు ఇదే సీజన్‌లో తనకు కలిసొచ్చిన స్వరకర్తతో హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడీ నందమూరి హ్యాండ్సమ్ హీరో.

‘ఎవడు’, ‘ఊపిరి’ సెంటిమెంట్... ‘మహర్షి’లో కూడా రిపీట్
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే… గత రెండు చిత్రాల్లో ఫాలో అయిన ఆ సెంటిమెంట్‌ని… విడుదలకు సిద్ధమైన తన తాజా చిత్రం ‘మహర్షి’లో కూడా కంటిన్యూ చేసాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ సెంటిమెంట్ పేరే… జయసుధ. గత కొంతకాలంగా తల్లి పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్న ఈ సహజ నటి… వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’లో కూడా భాగమయ్యారు. ఈ సినిమాలో మహేష్‌కి తల్లిగా నటించారు జయసుధ. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో వంశీ దర్శకత్వంలో జయసుధ తల్లిగా నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

ఇంద్రగంటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "V"
గ్రహణం మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన మోహన్ కృష్ణ ఇంద్రగంటి మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత,జెంటిల్ మాన్, అమీ తుమీ, సమ్మోహనం వంటి సక్సెస్ ఫుల్ ,ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు ఇంద్రగంటి ఇప్పుడు V టైటిల్ తో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో V మూవీ రూపొందుతుంది.అదితి రావు హైదరి, నివేత థామస్ కథానాయికలు కాగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

నానికి ఎమోషన్స్ లేవా?
ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ అందించిన విజయంతో మంచి జోష్‌లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. కాగా… ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాతో పాటు తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు నాని. ఇది నానికి 25వ సినిమా కావడం విశేషం. గతంతో వీరిద్దరి కాంబినేషన్‌లో అష్టాచమ్మా, జెంటిల్ మన్ వంటి విజయవంతమైన సినిమాలు రావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది.

భారీ స్థాయిలో మహర్షి బుకింగ్స్
మహర్షి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు ‘మహర్షి’ చిత్రానికి హైప్ తీసుకురావడంతో ఈ మూవీపై అభిమానాలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ మళ్లీ హిట్ కొట్టబోతున్నాడనే కాన్ఫిడెన్స్‌తో ఆయన ఫ్యాన్, మహర్షి చిత్రయూనిట్. ఇక వారి అంచనాలకు తగినట్టుగా ఇప్పుడు మహర్షి రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు టికెట్స్ బుకింగ్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.