డ‌బుల్ బొనాంజా ఇవ్వ‌నున్న త‌మ‌న్నా

Double Bonanza For Tamannaah Fans,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamannaah Gives Big Surprise To Her Fans,Actress Tamannaah New Movie Updates,Tamannaah Next Project Details,Tamannaah Upcoming Film News
Double Bonanza For Tamannaah Fans

ఈ ఏడాది సంక్రాంతికి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ‘ఎఫ్ 2’. ఇందులో హారికగా మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఈ నెల‌లో ఒకే రోజున‌ రెండు హార‌ర్ మూవీస్‌తో సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అందులో ఒకటి బైలింగ్వ‌ల్ మూవీ ‘అభినేత్రి 2’ కాగా.. మరొకటి హిందీ చిత్రం ‘ఖామోషి’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివరాల్లోకి వెళితే… 2016లో ఘన విజయం సాధించిన ట్రైలింగ్వ‌ల్‌ మూవీ ‘అభినేత్రి’ (తమిళంలో ‘దేవి’)కి సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ‘అభినేత్రి’లో జంటగా నటించిన తమన్నా, ప్రభుదేవా… ‘అభినేత్రి 2’లోనూ మరోసారి జంటగా అలరించనున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ ఫిలిం మే 31న రిలీజ్‌ కానుంది. కట్ చేస్తే… అదే రోజున‌ తమ్మూ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఖామోషి’ కూడా విడుదల కానుంది. ఇందులో తమ్మూ మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఇందులో ప్ర‌భుదేవా విలన్‌గా దర్శనమివ్వ‌నున్నాడు. కాగా… ఈ హారర్ మూవీకి ‘ఈనాడు’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహించాడు.

మొత్త‌మ్మీద‌… ఒకే రోజున రెండు హారర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్ట‌నున్న తమ్మూకి ఎటువంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న ‘సైరా’లో త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే హిందీ చిత్రం క్వీన్కి రీమేక్‌గా తెర‌కెక్కిన ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =