`మ‌హ‌ర్షి`కి `దిల్‌` రాజు `బెస్ట్ క‌పుల్‌` సెంటిమెంట్

Dil Raju Best Couple Sentiment For Maharshi Movie,Telugu Filmnanagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dil Raju Best Couple Sentiment For Prakash Raj and Jayasudha,Who Will Be Couple Sentiment For Dil Raju,Dil Raju Next Project Details,Dil Raju Sentiment For Maharshi Movie
Dil Raju Best Couple Sentiment For Maharshi Movie

కొన్ని జంటలు వెండితెరపై మ్యాజిక్ చేస్తాయి. వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరి విజయం సాధిస్తే… ఆ జంటను పదే పదే చూడాలని ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో… అలాగే అలాంటి జంటలను వారి సినిమాల్లో కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని దర్శక, నిర్మాతలకూ అనిపిస్తూ ఉంటుంది. అలా… ప్రేక్షకులు మెచ్చిన జంటల్లో ప్రకాష్ రాజ్, జయసుధ జోడీ ఒక‌టి కాగా… వారిని తన సినిమాల్లో ప‌దే ప‌దే రిపీట్ చేసి విజ‌యాలు సాధించిన‌ నిర్మాత టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘దిల్’ రాజు నిర్మాణంలో ప్రకాష్ రాజ్, జయసుధ కలసి తొలిసారి భార్యాభర్తలుగా నటించిన చిత్రం ‘బొమ్మరిల్లు’(2006). భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే… రెండోసారి వీరిద్ద‌రూ జంట‌గా నటించిన చిత్రం ‘కొత్త బంగారు లోకం’(2008). శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కట్ చేస్తే… ఐదేళ్ళ విరామం తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(2013)తో మరోసారి జంట‌గా న‌టించారు ప్ర‌కాష్‌, జ‌య‌సుధ‌. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది. అలాగే… ‘శతమానం భవతి’(2017) చిత్రంతో మరోసారి భార్యాభర్తలుగా ప్రేక్షకులను అలరించిందీ జంట. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేప‌థ్యంలో… ‘మహర్షి’లో మరోసారి భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు ప్ర‌కాష్‌ రాజ్, జయసుధ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి… దిల్‌ రాజు బేన‌ర్‌లో ఇంతవరకు అపజయమే ఎరుగని ఈ జంట… ‘మహర్షి’తో మరో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =