మహర్షి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు ‘మహర్షి’ చిత్రానికి హైప్ తీసుకురావడంతో ఈ మూవీపై అభిమానాలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ మళ్లీ హిట్ కొట్టబోతున్నాడనే కాన్ఫిడెన్స్‌తో ఆయన ఫ్యాన్, మహర్షి చిత్రయూనిట్. ఇక వారి అంచనాలకు తగినట్టుగా ఇప్పుడు మహర్షి రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు టికెట్స్ బుకింగ్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మహర్షి’ బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే టికెట్ లు మొత్తం సేల్ అయిపోయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయిపోయి.. మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు ‘మహర్షి’ బుకింగ్స్ కి ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పెట్టేశారట. అంతేకాదు… టికెట్ కాస్ట్ ను భారీగా పెంచినా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా టికెట్ ను కొనేస్తున్నారట అభిమానులు. మరి ఇప్పుడే ఇలా ఉండే సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకేలా ఉంటుందో. చూద్దాం ఏం జరుగుతుందో…
కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: