జూన్ నుంచి అఖిల్ త‌దుప‌రి చిత్రం షూటింగ్‌?

2019 Latest Telugu Movie News, Akhil New Movie Latest Updates, Akhil New Movie Shoot To Being From June, Akhil Next Film Shooting Starts On June, Akhil Next Project Details, Akhil Upcoming Movie Shooting News, Hero Akhil New Movie Commerce From June, Telugu Film Updates, Telugu Filmnanagar, Tollywood Cinema News
Akhil New Movie Shoot To Being From June

‘అఖిల్’, ‘హలో’ చిత్రాలతో క‌థానాయ‌కుడిగా ఆకట్టుకున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఇటీవల ‘మిస్ట‌ర్ మజ్ను’తో పలకరించిన ఈ యంగ్ హీరోకి… కెరీర్‌లో ఇంతవరకు ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో… సాలిడ్ హిట్‌ కోసం అఖిల్‌ ఈ సారి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’, ‘ఆరెంజ్’ వంటి మ్యూజిక‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు భాస్కర్‌తో అఖిల్ తన తదుపరి చిత్రం చేయ‌నున్న‌ సంగతి తెలిసిందే. భాస్క‌ర్‌ గత చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు స్కోప్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా… ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా… జూన్ రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని వినికిడి. అంతేకాదు… ఈ లోపు క‌థానాయిక ఎవ‌రనే విష‌యంపై కూడా క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించ‌బోతున్న‌ ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

[subscribe]
[youtube_video videoid=l2KmkThwcic]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 14 =