నానికి ఎమోష‌న్స్ లేవా?

Nani V Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani V Movie Latest News,Nani and Sudheer Babu New Movie Titled as V,Natural Star Nani Next Film Updates,Nani Role in V Movie,Nani To Play a Different Role in V Movie
Nani V Movie Latest Update

ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ అందించిన విజయంతో మంచి జోష్‌లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. కాగా… ప్రస్తుతం విక్రమ్‌ కుమార్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న‌ ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాతో పాటు తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు నాని. ఇది నానికి 25వ సినిమా కావడం విశేషం. గ‌తంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అష్టాచ‌మ్మా, జెంటిల్ మ‌న్ వంటి విజ‌యవంత‌మైన సినిమాలు రావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పై ఆస‌క్తి నెల‌కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ‘వి’లో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. వీరిద్ద‌రి సరసన నివేదా థామస్, అదితిరావ్‌ హైదరి నాయికలుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే… ఈ సినిమాలో నాని ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడ‌ట. ఏ మాత్రం ఎమోషన్స్ లేని ఓ నెగటివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని సమాచారం. సుధీర్ బాబు పాత్ర కూడా ఇంచుమించు అలానే ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు..

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంద‌ని… సినిమాలో ఎమోషన్స్, మెలోడ్రామా వంటివి చాలా తక్కువగా ఉంటాయని… ముఖ్యంగా నాని పాత్ర ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంద‌ని స‌మాచారం. మరి ‘జెర్సీ’లో భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో ప్రేక్షకుల చేత‌ కంట తడిపెట్టించిన నాని… వి కోసం ఏ మాత్రం ఎమోషన్స్‌ లేని పాత్రలో ఏ మేర‌కు అల‌రిస్తాడో చూడాలి. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది.

[subscribe]
[youtube_video videoid=1kJSL8cYbyU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 2 =