
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 43



మహర్షి మూవీ తో కల్కి కమర్షియల్ ట్రైలర్
మన హీరోల 25 సినిమాల ల్యాండ్ మార్క్

జోరు పెంచిన యువ హీరోలు
మే 9... కేరాఫ్ బ్లాక్ బస్టర్స్

హిప్పీ మూవీ ట్రైలర్ విడుదల

‘దబాంగ్ 3’లో సౌత్ ఫ్లేవర్

డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవికి హ్యాపీ బర్త్‌డే

నిత్యా మీనన్‌తో రాజ్ తరుణ్ ప్రేమకథ?

మహర్షి మూవీ మౌత్ టాక్

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్‌డే

ఇన్ ట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో కొత్త సినిమా
మహర్షి ని వాడుకుంటున్న సీత

డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జూన్ మొదటి వారంలో కిల్లర్
అవతార్ 2,3,4 5 రిలీజ్ డేట్స్ ఫిక్స్

7 మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ త్వరలో

మరో బయోపిక్ గణితశాస్త్ర మేథావిగా

`రూలర్`గా బాలకృష్ణ?
ఒకప్పుడు తెలుగు టైటిల్స్‌తోనే అలరించిన నందమూరి బాలకృష్ణ… ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’… వంటి ఇంగ్లీష్ టైటిల్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. అంతేకాదు… తన అప్‌కమింగ్ మూవీకి కూడా ఇంగ్లీష్ టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ టాక్.

స్టూడెంట్ గా - సీఈవో గా- రైతుగా త్రీ- డైమన్షన్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ సూపర్బ్
సినిమా మొత్తం మోస్ట్ ఎంజాయ్ బుల్ గా , ఇన్స్పిరేషనల్ గా అలరిస్తుంది "మహర్షి". మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో తన 25 వ చిత్రంగా ఇలాంటి సోషల్ రిలవెన్స్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ కంటెంట్ తో రావటం అభినందనీయం.

మహర్షి మూవీ తో కల్కి కమర్షియల్ ట్రైలర్
శివాని శివాత్మిక సమర్పణ లో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా కల్కి మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న కల్కి మూవీ లో అదా శర్మ, నందిత శ్వేత కథానాయికలు. 1983 సంవత్సరం నేపథ్యం లో రూపొందిన కల్కి మూవీ కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. మే 9వ తేదీ రిలీజయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ తో పాటు కల్కి మూవీ కమర్షియల్ ట్రైలర్ రిలీజయింది.
మన హీరోల 25 సినిమాల ల్యాండ్ మార్క్
ఒకప్పుడు ఒక హీరో ఒక ఏడాదికి మూడు నాలుగు సినిమా చేసేవారు. అంతకంటే ఎక్కువ సినిమాలు చేసేవారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఆనాటి హీరోలు తమ సినీ కెరీర్ లో రెండు మూడొందలకు పైగా సినిమాలు తీసేవారు. అయితే అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా తీయడమే చాలా కష్టంగా మారింది. అప్పట్లో సెంచరీ చేయడం అనేది ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్ కాస్తా 25 సినిమాలకు తగ్గింది. అంతేకాదు.. అప్పట్లో జయాపజయాలతో పని లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడున్న హీరోలు.. ఒక ఫ్లాప్ వచ్చిందంటే చాలు.. మరో సినిమా చేయడానికి భయపడుతున్నారు. దీనికి…

జోరు పెంచిన యువ హీరోలు
టాలీవుడ్ లో నాని, నితిన్, నాగ చైతన్య, శర్వానంద్, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, రానా, నాగ శౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయవంటి యంగ్ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరో లు సంవత్సరానికి ఒక మూవీ మించి నటించడం లేదు. సీనియర్ దర్శకులు, యువ దర్శకులు యువ హీరోలతో సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ లో యువ దర్శకులు తమ వయసుకు తగ్గట్టు కథలను రూపొందించడం తో యువ హీరోలు సంవత్సరానికి 2లేదా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
మే 9... కేరాఫ్ బ్లాక్ బస్టర్స్
మే 9… తెలుగు చిత్ర పరిశ్రమకి కలిసొచ్చిన తేదీ. గతంలో ఇదే తేదికి రిలీజైన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అంతేకాదు… కెరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీస్‌గా నిలిచాయి. ఆ జ్ఞాపకాల్లోకి వెళితే…

హిప్పీ మూవీ ట్రైలర్ విడుదల
V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా తెలుగు తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ నటించిన హిప్పీ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక కీలక పాత్ర లో నటించిన హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

‘దబాంగ్ 3’లో సౌత్ ఫ్లేవర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో పలు ఘనవిజయాలున్నాయి. వాటిలో… ‘గబ్బర్ సింగ్’(2012) ఒకటి. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీనాట ఘన విజయం సాధించిన ‘దబాంగ్’(2010)కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. విశేషమేమిటంటే… ఈ రెండు వెర్షన్లు కూడా ఆ యా స్టార్ హీరోల వరుస పరాజయాలకు బ్రేక్ వేయడం విశేషం.

డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవికి హ్యాపీ బర్త్‌డే
“భానుమతి… ఒక్కటే పీస్” అంటూ ‘ఫిదా’లో సాయిపల్లవి చెప్పిన డైలాగ్… ఆమె సినీ కెరీర్‌కు చక్కగా సరిపోతుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ బ్యూటీ… అనతికాలంలోనే దక్షిణాదిన నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

నిత్యా మీనన్‌తో రాజ్ తరుణ్ ప్రేమకథ?
వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయిని ప్రేమించే యువకుడి కథతో ఆ మధ్య ‘ఆరోప్రాణం’ (1997) (వినీత్, సౌందర్య) వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్‌తో మరో చిత్రం రానుందని టాలీవుడ్ టాక్.

మహర్షి మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్‌డే
“ప్రతిభే ఉంటే పై వాడైనా నిన్నాపలేడు” … ఓ సూపర్ హిట్ సాంగ్‌లోని ఈ లైన్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ… వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ… నేడు టాలీవుడ్ గర్వించదగ్గ యువ కథానాయకులలో ఒకడిగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. కాగా… తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్… నేడు 30వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా విజయ్ నటనాప్రస్థానానికి సంబంధించి కొన్ని విశేషాలు..

ఇన్ ట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో కొత్త సినిమా
భావోద్వేగభరిత ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన తెరకెక్కించిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి చిత్రాలే దీనికి అద్దం పడతాయి. ఇక ఇటీవలే అలాంటి నేపథ్యంలో శర్వానంద్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా పడిపడి లేచే మనసు అనే సినిమా తెరకెక్కించాడు. అయితే దానికి మాత్రం అంత ఫలితం రాలేదనుకోండి.
మహర్షి ని వాడుకుంటున్న సీత
‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రం 'సీత'. కెరీర్ లో మొదటిసారి నెగెటివ్ షేడ్ లో.. అహంకార స్వభావంతో ఉండే పాత్రలో నటిస్తుంది కాజల్. ఈ పాత్రే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందంటున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొంద, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అర్జున్ రెడ్డి' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా. ఇక ఈసినిమాతో అప్పటికే పెళ్లి చూపులు సక్సెస్ తో ఉన్న విజయదేవరకొండ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.

జూన్ మొదటి వారంలో కిల్లర్
ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కొలైగారన్. దియా మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాలో అషిమా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ కిల్లర్ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మర్డర్ మిస్టరీ.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సైమన్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జూన్ తొలి వారంలో ఈ సినిమాను రిలీజ్…
అవతార్ 2,3,4 5 రిలీజ్ డేట్స్ ఫిక్స్
టైటానిక్ ఫేమ్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసింది. అత్యధిక వసూళ్లు సాధించి ఈ సినిమా ఆల్‌టైం రికార్డ్‌ను సృష్టించింది. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ.

7 మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ త్వరలో
కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై నిజార్ షఫీ దర్శకత్వంలో రెహమాన్, హవిష్, రెజీనా కసాండ్ర, నందిత శ్వేత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి తారాగణం గా రూపొందిన 7 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు రమేష్ వర్మ నిర్మించిన 7 మూవీ లో రెహమాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్, 7 మూవీ కి సంగీతం సమకూర్చారు.

మరో బయోపిక్ గణితశాస్త్ర మేథావిగా
బాలీవుడ్ లో స్కిల్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు విద్యాబాలన్. ఇక టాలీవుడ్ లో నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు. ఇక ఈ బయోపిక్ ద్వారా టాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను పోషించారు విద్యాబాలన్ ఈసినిమాలో. ఆ పాత్రలో ఆమె తన నటనతో అందరినీ మెప్పించారు. తాను మాత్రమే ఆ పాత్ర చేయగలదన్నట్టు జీవించారు.