మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్

Interesting Title For Mega Hero Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,New Title For Mega Hero Debut Film,Mega Hero Vaishnav Tej New Movie Gets an Interesting Title,Mega Hero Vaishnav Tej Debut Movie Titled as Uppena,Vaishnav Tej New Movie Uppena
Interesting Title For Mega Hero Movie

మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతూ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాకు మాత్రం పలు టైటిల్స్ వార్తల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో తాను జాలరి లా నటిస్తున్న నేపథ్యంలో ఈ టైటిల్ పిక్స్ చేశారనుకున్నారు. అయితే ఈ టైటిల్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. మరి ఈ టైటిల్ పై అయినా చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తుందో?లేదో?

కాగా ఇందులో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.

[subscribe]
[youtube_video videoid=QtGr3NQVyyk ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =