కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా సి.కల్యాణ్ నిర్మాణంలో గత ఏడాది వచ్చిన ‘జైసింహా’ ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ కె.ఎస్ రవి కుమార్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ముందు బోయపాటితో సినిమా అంటూ వార్తలు వచ్చినా… ఆ తరువాత కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్ లోనే తన సినిమా ఉండబోతుందని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం..ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారట.. జూన్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
అయితే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో జగపతి బాబును కూడా ఎంచుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని.. చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ – జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో…?
[subscribe]
[youtube_video videoid=Beb6rhfh8Ew]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: