ద‌ర్శ‌కుడిగా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పూర్తిచేసుకున్న సుకుమార్

15 Years For Sukumar As A Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Aarya Movie Turns 15 Years In Film Industry, Sukumar Completes 15 Years As A Director in Industry,15 Years For Sukumar in TFI,Tollywood Director Sukumar Latest Updates,15 Years of Allu Arjun Aarya Movie
15 Years For Sukumar As A Director

ఇన్నోవేటివ్ థాట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిల‌చిన ఈ జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. తొలి చిత్రం ఆర్యనుంచి గ‌త చిత్రం ‘రంగస్థలం’ వ‌ర‌కు త‌న‌ది అదే బాణి. అంతేకాదు… రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు సుక్కు. అందుకే 15 ఏళ్ళ ద‌ర్శ‌క ప్ర‌స్థానంలో కేవ‌లం 7 చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. త‌న ఆలోచ‌న‌ల‌కి తెర రూప‌మిస్తూ న‌వ్య రీతిలో సుకుమార్‌ రూపొందించిన ప్ర‌తీ సినిమా… యూత్‌ని మెస్మ‌రైజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వ‌న్ సైడ్ ల‌వ్ అంటూ ఓ కొత్త కాన్సెప్ట్ తో రూపొందించిన మొద‌టి చిత్రం ‘ఆర్య’ మొద‌లు… జగడం, ఆర్య 2, 100% లవ్, ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ వ‌ర‌కు ప్ర‌తీ సినిమా… ఈ మాజీ లెక్క‌ల మాస్ట‌ర్‌లోని సృజ‌నాత్మ‌క‌త‌కు అద్దం ప‌ట్టింది అయితే… గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వ‌చ్చిన‌ ‘రంగస్థలం’ మాత్రం సుకుమార్ కెరీర్‌కి క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ బూస్ట‌ప్‌ని ఇచ్చి బిగ్గెస్ట్‌ హిట్‌ని అందించింది. మొత్త‌మ్మీద‌… ప‌రిమిత చిత్రాల‌తో అప‌రిమిత అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకున్నాడు ఈ బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌.

ఇంత‌కీ… ఇప్పుడు సుకుమార్ ప్ర‌స్థానంతో ఈ ప్ర‌స్తావ‌న అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే… స‌రిగ్గా ఇదే మే 7న 15 ఏళ్ళ క్రితం త‌న తొలి చిత్రం ఆర్య(2004) విడుద‌లైంది కాబ‌ట్టి. అంటే… నేటితో ద‌ర్శ‌కుడిగా సుకుమార్ దశాబ్దన్నర కాలం పూర్తి చేసుకున్నాడ‌న్న‌మాట‌. ఈ సంద‌ర్భంగా… మ‌రోసారి సుకుమార్ కి శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తూ… త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు బ‌న్నీతో తెర‌కెక్కిస్తున్న కొత్త చిత్రంతో రంగ‌స్థ‌లంకి మించిన ఘ‌న‌విజ‌యం అందుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]
[youtube_video videoid=8KM93amOG0c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =