
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 2


ఎంటర్టైన్మెంట్+యాక్టీవ్ =శ్రీముఖి
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ?

KRKR మూవీ లో జగన్ పాత్రలో నటుడు అజ్ మల్
నాని సొంత బ్యానర్ పై హిట్ మూవీ ప్రారంభం
నిఖిల్ ‘కార్తికేయ’కు ఐదేళ్ళు
నవంబర్ ద్వితీయార్ధం నుంచి చిరు, కొరటాల చిత్రం?
అన్నయ్య బాటలో తమ్ముడు
తుది దశలో ‘డిస్కో రాజా’?
విజయ్ సినిమాలకే - మరో ట్విట్టర్ ఎమోజీ
గోపీచంద్ కు అభయమిచ్చిన తేజ
భాగమతి బాలీవుడ్ రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్
'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్..?

జెన్యూనిటీకి C/O అడ్రస్ వరుణ్ సందేశ్

విజిల్ మూవీ 4200 థియేటర్స్ లో రిలీజ్

బయటకొచ్చిన 'జాతిరత్నాలు'
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్రయూనిట్. ‘జాతిరత్నాలు’ అనే విభిన్న టైటిల్ తో.. 420, 210,840 నంబర్లు కలిగిన ఖైదీ దుస్తులు ధరించి ఉన్న నవీన్, ప్రియదర్శి, రాహుల్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

ఎంటర్టైన్మెంట్+యాక్టీవ్ =శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి గుర్తొస్తుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 లో సందడి చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ చిరు సత్కారం
'సైరా నరసింహారెడ్డి' విజయ నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. చరిత్ర విస్మరించిన ఒక స్వాతంత్ర పోరాట యోధుడి జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించి స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తూ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు బొకే అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ " సైరా" సినిమా చూసి నా సహా నటీనటులు, పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు అభినందిస్తుంటే చాలా ఆనందం వేసింది. అయితే నా కుటుంబ సభ్యుల్లాంటి ఫిల్మ్ జర్నలిస్ట్ ల నుండి ఇలాంటి అభినందన దక్కటంతో నేను…
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ?
లెజండరీ యాక్ట్రెస్ అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ మరాఠీ మూవీ సైరత్ హిందీ రీమేక్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్ దోస్తానా , తఖ్త్, గుంజన్ సక్సేనా బయోపిక్, రూహ్ అఫ్జా మూవీస్ లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ను తెలుగు లో నటింపజేయడానికి పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ లో రూపొందనున్న యాక్షన్ డ్రామా మూవీ కై జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నారని సమాచారం.

KRKR మూవీ లో జగన్ పాత్రలో నటుడు అజ్ మల్
రక్త చరిత్ర , లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాస్పద చిత్రాల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద మూవీ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థి తులలో ఉన్న రాజకీయ నాయకులు ప్రధాన పాత్రలలో కనిపించే కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతుంది. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, జగన్ డూప్ నటులతో రూపొందుతున్న KRKR మూవీ లోని 3సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నాని సొంత బ్యానర్ పై హిట్ మూవీ ప్రారంభం
హీరో నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ ! మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహానీ శర్మ జంటగా యాక్షన్ థ్రిల్లర్ హిట్ మూవీ హీరో నాని క్లాప్ తో ఈ రోజు ప్రారంభమయింది. నేచురల్ స్టార్ నాని సమర్పణ లో ప్రశాంతి త్రిపురనేని నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న హిట్ మూవీ కి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
మొన్న వాణిశ్రీ... నిన్న చిరు... నేడు విజయశాంతి
సంక్రాంతి అనగానే పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ కళ్ళముందు కదలాడతాయి. అంతేకాదు... ఈ సీజన్ లోనే పలువురు స్టార్స్ రీ-ఎంట్రీ ఇచ్చిన వైనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కళాభినేత్రి వాణిశ్రీ, మెగాస్టార్ చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ సంక్రాంతి సమయంలోనే రీ-ఎంట్రీ ఇచ్చి ఘనవిజయాలు అందుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో సూపర్ స్టార్ కూడా ముగ్గుల పండక్కి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ స్టార్ మరెవరో కాదు... లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. `నాయుడమ్మ` (2006) తరువాత చిత్రపరిశ్రమకు దూరమైన మన రాములమ్మ... 2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`తో వెండితెరపై మరోసారి వెలుగులు పంచేందుకు…
'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ నుండి మలయాళం రీమేక్..!
వెంకటేశ్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు ఎంత మంచి ప్రశంసలు దక్కాయో తెలిసిందే. చిన్న బడ్జట్ లో, ఒరిజినల్ లొకేషన్స్ లో, నాచురల్ యాక్టర్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంశలు సైతం దక్కించుకున్నాడు వెంకటేష్ మహా. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మహా రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
నిఖిల్ ‘కార్తికేయ’కు ఐదేళ్ళు
సస్పెన్స్‌కి కామెడీ తోడైతే ఆ ఫార్ములా సూపర్ హిట్టే. ఈ కోవకు చెందిన ఓ సినిమానే... `కార్తికేయ`. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ‘స్వామి రా రా’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత నిఖిల్, స్వాతి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా అదే బాట పట్టడం విశేషం. చందు మొండేటి దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీలో .. తనికెళ్ళ భరణి, రావురమేష్, ప్రవీణ్, తులసి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
నవంబర్ ద్వితీయార్ధం నుంచి చిరు, కొరటాల చిత్రం?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... నవంబర్ ద్వితీయార్ధం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఆపై నిరవధికంగా చిత్రీకరణ జరిపి... 2020 ఉగాదికి ఈ సినిమాని విడుదల చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అన్నయ్య బాటలో తమ్ముడు
కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఖైదీ’(1983) టైటిల్‌తో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తుది దశలో ‘డిస్కో రాజా’?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తుండగా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
విజయ్ సినిమాలకే - మరో ట్విట్టర్ ఎమోజీ
తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు 180కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు కూడా మాములుగా లేవు. ఇప్పుడు బిగిల్ మూవీ కి మరో అరుదైన గౌరవం దక్కింది. బిగిల్ చిత్రానికి ట్విట్టర్ ప్రత్యేకమైన ఎమోజి సింబల్ ఇవ్వడం జరిగింది. గతంలో మెర్సిల్ సినిమా కు ట్విట్టర్ ఎమోజీ రాగా.. ఇప్పుడు బిగిల్ మూవీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. బిగిల్ కు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చింది. కాగా విజయ్ కి జంటగా నయనతార నటిస్తున్న బిగిల్ దీపావళి కానుకగా ఈనెల 25న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల అవుతుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై…
అట్లీ తో ఎన్టీఆర్ మూవీ - క్లారిటీ వచ్చేసినట్టే..!
విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా బిగిల్. ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజిల్ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్బంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది.
గోపీచంద్ కు అభయమిచ్చిన తేజ
పాపం కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమాపై అంచనాలు పెంచుకున్నా.. ఆ అంచనాలను అందుకోలేకపోయాడు 'చాణక్య'. దీనితో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాతలు భయపడుతున్నారు. ఇటీవలే గోపీచంద్ చేతులోంచి ఓ సినిమా జారిపోయింది. సంపత్ నందితో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. అది సెట్స్‌పైకి వెళ్లేంత వరకూ సినిమా ఉంటుందో లేదో కూడా…
భాగమతి బాలీవుడ్ రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ మూవీ భాగమతి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు భాగమతి మూవీ హిందీ లో రీమేక్ కానుంది. తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ ఈ హిందీ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు . అనుష్క రోల్ కు యంగ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ భూమి పెడ్నేకర్ ఎంపిక అయ్యారు. దర్శకుడు అశోక్ లొకేషన్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.
'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్..?
టాలీవుడ్ లో అభిమానులు కాకుండా భక్తులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పొచు. కానీ తమ అభిమానులను కాస్త నిరాశ పరిచి సినిమాలకు గుడ్ బై చెప్పి మొత్తం రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ మధ్య పవన్ మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు రావడంతో.. తను ఇంకా సినిమాలు చేయనని అప్పట్లో క్లారిటీ ఇచ్చేసాడు. కానీ పవన్ చెప్పినా కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.

జెన్యూనిటీకి C/O అడ్రస్ వరుణ్ సందేశ్
బిగ్ బాస్ 3 హౌస్ లో జెన్యూనిటీ కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఏ మాత్రం తడుముకోకుండా మనకు గుర్తొచ్చే పేరు వరుణ్ సందేశ్. కపుల్స్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా వరుణ్ ఎప్పుడూ వితికాను ఒక కంటెస్టెంట్ లాగానే చూసుకుంటూ వచ్చాడు. అంతే కాదు మొదటినుండీ ఎవరైనా తప్పు చేసినా.. మొహం మీదే చెప్పేయడం... తాను కోపంలో ఏమన్నా అన్నా కూడా.. తర్వాత తనే వెళ్లి సారీ చెప్పడం.. ఆఖరికి వితికా తప్పు చేసినా కూడా అందరిముందు స్ట్రైట్ గా చెప్పేయడం ఇలా జెన్యూనిటీ కి షర్ట్ ప్యాంటు వేస్తే ఎలా ఉంటాడో అలా ఉండటంతో అందరికీ మోస్ట్ ఫెవరెట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఎంతలా అంటే బిగ్ బాస్ విన్నర్ ఇంక వరుణ్ సందేశే అని ఫిక్స్ అయిపోయారు…

విజిల్ మూవీ 4200 థియేటర్స్ లో రిలీజ్
AGS ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ , నయనతార జంటగా ఫుట్ బాల్ క్రీడానేపథ్యం లో రూపొందిన కమర్షియల్ ఎంటర్ టైనర్ బిగిల్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానున్నాయి. బిగిల్ తెలుగు, తమిళ వెర్షన్స్ 4200 థియేటర్స్ లో రిలీజ్ కావడం విశేషం. బిగిల్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ S కోనేరు రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ రిలీజ్ చేసిన మత్తువదలరా మూవీ ఫస్ట్ లుక్
మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అంతా కొత్తవారితో రూపొందుతున్న మత్తువదలరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఈ రోజు రిలీజయింది . నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సింహ కోడూరి బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీ కి దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.