ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 3
నాగార్జున ‘శివమణి’కి 16 ఏళ్ళు
సీనియర్ డైరెక్టర్ తనయుడి "నిశ్శబ్ధం "
చిరంజీవి ‘విజేత’కు 34 ఏళ్ళు
`మెగాస్టార్ చిరంజీవి - 152` కోసం భారీ బడ్జెట్ ?
మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ‘దేవదాస్’ దర్శకుడు?
సెన్సార్ పూర్తిచేసుకున్న `ఖైదీ`
'ఆదిత్య వర్మ' ట్రైలర్ రిలీజ్

'శివన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
లెజెండరీ యాక్ట్రెస్ @ 400
డిస్కో రాజా మూవీ యాక్షన్ సీన్స్ షెడ్యూల్ పూర్తి
తండ్రీ తనయుల మల్టీ స్టారర్ మూవీ

'గూగుల్ కామియో' - సౌత్ ఇండియాలో మొదటి నటుడు
రంగమార్తాండ మూవీ లో చిన్నారి పెళ్ళికూతురు
దబాంగ్ 3 మూవీ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తం గా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన మూవీ రిలీజంటే అభిమానులకు పెద్ద పండగే. హీరో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించిన దబాంగ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 కూడా ఘనవిజయం సాధించింది. దబాంగ్ మూవీ సిరీస్ లో దబాంగ్ 3 రూపొందింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్టింగ్ &మీడియా లిమిటెడ్ బ్యానర్స్ పై ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , సోనాక్షి సిన్హా జంటగా రూపొందిన దబాంగ్ 3 మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది.
నార్త్ డామినేషన్ కు బ్రేక్ వేసిన వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్
రానున్న నవంబర్ 11 నాటికి ప్రభాస్ తెలుగు తెరకు పరిచయమై 17 ఏళ్లు పూర్తవుతాయి.2002 నవంబర్ 11న విడుదలైన ' ఈశ్వర్' చిత్రం ద్వారా రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా పరిచయమైన ప్రభాస్ ను చూసి కుర్రాడు బాగున్నాడు... బాగానే చేశాడు... ఫర్వాలేదు... పైకొస్తాడు... ఇలాంటి అత్తెసరు మార్కుల పరిమిత ప్రశంసలు మాత్రమే వినిపించాయి. తొలి చిత్రమైన ఈశ్వర్, మలి చిత్రమైన రాఘవేంద్ర వరకు అలాంటి బొటాబొటీ మార్కులు సంపాదించుకున్న ప్రభాస్ మీద మూడవ చిత్రమైన 'వర్షం' ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది.అలా తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకోవటానికి మూడవ చిత్రం దాకా నిరీక్షించిన ప్రభాస్ ఈ రోజున 'ఆల్ ఇండియా…

డిసెంబర్ రిలీజ్ కే ఇంట్రెస్ట్ చూపుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు పలు వార్తలు వస్తున్నాయి.
నాగార్జున ‘శివమణి’కి 16 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున పలు కాప్ స్టోరీస్‌లో నటించారు. వాటిలో ‘శివమణి 98480 22338’ది ప్రత్యేక స్థానం. `నా పేరు శివమణి... నాకు కొంచెం మెంటల్` అంటూ అంతకుముందు ఎన్నడూ కనిపించని ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో సందడి చేశారు నాగ్. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, అలీ, సంగీత, ఏవీయస్, ఎం.ఎస్.నారాయణ, బండ్ల గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నికోలస్ స్పార్క్స్ రచించిన ‘మెసేజ్ ఇన్ ఎ బాటిల్’ నవల ఆధారంగా ఇందులోని కొన్ని సన్నివేశాలను రూపొందించారు. ఇక పూరి అందించిన సంభాషణలు సినిమాకి ప్రత్యేక…
సీనియర్ డైరెక్టర్ తనయుడి "నిశ్శబ్ధం "
జరిగిన కథ , తల్లితండ్రులు, రామాలయం, లంబాడోళ్ళ రాందాసు మూవీస్ దర్శకుడు K .బాబూరావు తనయుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం 5భాషలలో రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందిన నిశ్శబ్దం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు.
చిరంజీవి ‘విజేత’కు 34 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, అగ్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిది విజయవంతమైన జోడి. ‘న్యాయం కావాలి’(1981)తో మొదలైన వీరి ప్రయాణం ‘ముఠామేస్త్రి’(1993) వరకు సాగింది. అలా... వీరిద్దరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘విజేత’ ఒకటి. చెల్లెలి పెళ్ళి కోసం తన మూత్రపిండాన్ని(కిడ్నీ) డొనేట్ చేసిన ఓ అన్నయ్య కథే ఈ `విజేత`. భానుప్రియ కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ‘ఊర్వశి’ శారద, జె.వి.సోమయాజులు, రంగనాథ్, గిరిబాబు, నూతన్ ప్రసాద్, శుభ, శ్రీలక్ష్మి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జంధ్యాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలనటుడిగా తొలి అడుగులు…
`మెగాస్టార్ చిరంజీవి - 152` కోసం భారీ బడ్జెట్ ?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ‘దేవదాస్’ దర్శకుడు?
‘భలే మంచి రోజు’(2015)తో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు శ్రీరామ్ ఆదిత్య. అనంతరం ‘శమంతకమణి’(2017), ‘దేవదాస్’(2018)తో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ మూడు చిత్రాలు కూడా క్రైమ్, థ్రిల్లింగ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందాయి. కాగా... తన నాలుగో సినిమాని కూడా క్రైమ్ థ్రిల్లర్‌గానే ఆదిత్య ప్లాన్ చేశాడని సమాచారం.
సెన్సార్ పూర్తిచేసుకున్న `ఖైదీ`
కార్తి కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం `ఖైదీ`. రా- యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా... తెలుగులోనూ అదే పేరుతో అనువాదం కానుంది. ఇందులో యావజ్జీవ ఖైదీ పాత్రలో దర్శనమివ్వనున్నాడు కార్తి. పదేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తున్న దిల్లీ అనే ఓ ఖైదీ... తన పదేళ్ళ కూతురిని చూడడం కోసం ఓ రోజు రాత్రి చెరసాల నుంచి తప్పించుకుంటాడు. ఈ నేపథ్యంలో... దిల్లీకి ఎదురైన అనుభవాలేంటి? అనే అంశంతో `ఖైదీ` తెరకెక్కింది. నాలుగు గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల చుట్టూ అల్లుకున్న ఈ కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు తండ్రీకూతుళ్ళ అనుబంధానికి కూడా పెద్ద పీట వేశాడు…
'ఆదిత్య వర్మ' ట్రైలర్ రిలీజ్
మొత్తానికి 'అర్జునరెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' అన్ని పనులు త్వరగా ముగించుకొని రిలీజ్ కు సిద్ధపడుతుంది. మొదటినుండి ఈ సినిమాకు కాస్త ఇబ్బందులు ఎదురైనా.. విక్రమ్ మాత్రం పట్టుపట్టి ఈ సినిమాను ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. కొడుకు ధృవ్ కంటే కూడా విక్రమ్ కే సినిమా ఎలా ఉంటుందో అని ఎక్కువ హార్ట్ బీట్ పెరిగిపోతుందట. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ నురిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

'అల వైకుంఠపురములో' నుండి 'రాములో రాములా'
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఇటీవలే ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’ అన్న పాటను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన తొలి తెలుగు పాటగా…
ఆమె హిందీ 'రీమేక్' అమలా పాల్ ప్లేస్ లో బాలీవుడ్ క్వీన్
రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ 'ఆడై' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్ సంచలనం సృష్టించారు. వీ స్టూడియోస్ బ్యానర్‌పై విజ్జి సుబ్రమణియన్ ఈసినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన అమలా పాల్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. కామిని పాత్రలో నటించడానికి అంత ధైర్యం చేసిన అమలా పాల్ విమర్శకుల ప్రసంశలు పొందింది.

'శివన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 24వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
లెజెండరీ యాక్ట్రెస్ @ 400
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ్ లో శివాజీ గణేశన్, ఎం.జీ రామచంద్రన్ వంటి మహా మహిళతో నటించిన లెజెండరీ యాక్ట్రెస్ షావుకారు జానకి. " షావుకారు" అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. అదే సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకొని.. తన సినీ ప్రస్థానం లో ఎన్నో సినిమాలు చేసి ఎంతో మంది హీరోయిన్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా పలు భాషల్లో ఇప్పటివరకూ దాదాపు 400 సినిమాల్లో నటించారు.
డిస్కో రాజా మూవీ యాక్షన్ సీన్స్ షెడ్యూల్ పూర్తి
SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ రివెంజ్ డ్రామా డిస్కో రాజా మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, నభా నటేష్ కథానాయికలు. వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S సంగీతం అందించారు. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
తండ్రీ తనయుల మల్టీ స్టారర్ మూవీ
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. E 4 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మూవీ గిరీశాయి దర్శకత్వంలో ఆదిత్య వర్మ గా రూపొందింది. ఆదిత్య వర్మ మూవీ తో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా కోలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

'గూగుల్ కామియో' - సౌత్ ఇండియాలో మొదటి నటుడు
'గూగుల్ కామియో' ఏంటి నాగచైతన్య మొదటి హీరో ఏంటి అనుకుంటున్నారా..? అసలుసంగతేంటంటే.. ఫ్యాన్స్ కు తమ అభిమాన హీరోల గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటారు. ఇక హీరోలకు కూడా కొన్ని రొటీన్ ప్రశ్నలే ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తన అభిమానుల కోసం నాగచైతన్య ఓ సరికొత్త ఆలోచన చేశాడు. గూగుల్ కామియో అనే యాప్ ద్వారా తనను రెగ్యులర్ గా అడిగే ప్రశ్నలకు తనే స్వయంగా సమాధానాలు.. గూగుల్ క్యామియో లో పెట్టాడు. దీనివల్లే ఉపయోగం ఏంటంటే.. డైరక్ట్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి నాగచైతన్య అని టైపు చేసి సెర్చ్ చేస్తే చాలు. "మోస్ట్ ఆస్క్ డ్ క్వశ్చన్స్" ట్యాగ్ కింద స్వయంగా నాగచైతన్య…

'ఆర్.ఆర్.ఆర్' - కొమరం భీమ్ లుక్ వచ్చేనా...!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు కొమరం భీమ్ జయంతి సందర్భంగా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు. " స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ధీరుడు కొమరం భీమ్... ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం.. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ ను యంగ్ భీమ్ గా వెండితెరపై చూపించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం" అని అన్నారు. దీనితో ఈ…
రంగమార్తాండ మూవీ లో చిన్నారి పెళ్ళికూతురు
చిన్నారి పెళ్ళికూతురు గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవికా గోర్ పలు టివి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. సక్సెస్ ఫుల్ మూవీ ఉయ్యాల జంపాల తో టాలీవుడ్ కు పరిచయమైన అవికాగోర్ నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీస్ విజయం సాధించాయి. రీసెంట్ గా రిలీజయిన రాజు గారి గది 3 మూవీ లో పెర్ఫార్మెన్స్ కు అవికాగోర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .
సరిలేరు నీకెవ్వరు స్పెషల్ సాంగ్ నవంబర్ లో చిత్రీకరణ
సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతున్న ఈ మూవీ రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొంది. మరొక షూటింగ్ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆసాంగ్ కు డాన్స్ లో తనదైన స్టైల్ ఉన్నతమన్నా ఎంపికయ్యారు.