లెజండరీ యాక్ట్రెస్ అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ మరాఠీ మూవీ సైరత్ హిందీ రీమేక్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్ దోస్తానా , తఖ్త్, గుంజన్ సక్సేనా బయోపిక్, రూహ్ అఫ్జా మూవీస్ లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ను తెలుగు లో నటింపజేయడానికి పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ లో రూపొందనున్న యాక్షన్ డ్రామా మూవీ కై జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ నిర్మాత, దర్శకుడిగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ ( పూరి , ఛార్మి ) నిర్మాణసారథ్యంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ డ్రామా ఫైటర్ మూవీ రూపొందనుంది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించనున్న ఫైటర్ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ ను విజయ్ కు జోడిగా నటింపజేసేందుకు పూరి జగన్నాథ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే ఫైటర్ మూవీ తో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ప్రవేశించే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























