బయటకొచ్చిన ‘జాతిరత్నాలు’

2019 Latest Telugu Movie News, Jathiratnalu First Look, Jathiratnalu Movie First Look, JathiRatnalu Movie First Look Out Now, Jathiratnalu Movie First Look Poster, Jathiratnalu Movie Updates, Telugu Film News 2019, Telugu Filmnagar

అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్రయూనిట్. ‘జాతిరత్నాలు’ అనే విభిన్న టైటిల్ తో.. 420, 210,840 నంబర్లు కలిగిన ఖైదీ దుస్తులు ధరించి ఉన్న నవీన్, ప్రియదర్శి, రాహుల్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరో నవీన్ పోలిశెట్టి ఈ మధ్య ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ప్రియదర్శి, రాహుల్ హీరో శ్రీవిష్ణు తో చేసిన ‘బ్రోచేవారెవరురా’ మూవీ కూడా మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం. మరి వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కామెడీ కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం వీరు ముగ్గురు కలిసి ఎంత నవ్విస్తారో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =