కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు

కళ్యాణ్ దేవ్ రెండో సినిమా - టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఫస్ట్ లుక్

కళ్యాణ్ దేవ్ రెండో సినిమా - టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. అయితే కల్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు సైమా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా పురస్కారం కూడా అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన 'అసురన్' ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ ఈ రీమేక్ ను చేస్తున్నట్టు టాలీవుడ్ లో ఒకటే వార్తలు చక్కర్లు కొట్టాయి.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ పోస్టర్

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత రాజకీయ నాయకుల పాత్రలతో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతుంది. కాంట్రవర్సీ మూవీస్ రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందించిన RGV మరో వివాదాస్పద మూవీ KRKR ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. KRKR మూవీ 3 సాంగ్స్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ మహాభారత్ లో ద్రౌపది

బ్లాక్ బస్టర్ మూవీ ఓం శాంతి ఓం తో బాలీవుడ్ లో ఎంటరయిన దీపికా పడుకొనే నటించిన చాందిని చౌక్ టు చైనా, లవ్ ఆజ్ కల్, హౌస్ ఫుల్ , కాక్ టైల్ , రేస్ 2, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీల, పీకు, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ సాధించాయి. యాసిడ్ అటాక్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చాపాక్ మూవీ లో దీపికా నటించి, సహనిర్మాతగా వ్యవహరించారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందిన 83 మూవీ కి దీపిక నటి,సహ నిర్మాత.

Team TFNవాట్సాప్
Karthi Khaidi Movie Highlight Scene,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Khaidi Movie Highlight Scene,Karthi Khaidi Movie Highlight,Karthi Khaidi Highlight Scene,Khaidi Telugu Movie
సినిమా వార్తలు

3 నిముషాలు.. సింగిల్ షాట్ హైలైట్ సీన్

'మా న‌గ‌రం' ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
Radhika Apte Turns Director,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Actress Radhika Apte Turns Director,Radhika Apte turns Director with Sleepwalkers,Radhika Apte Latest News 2019
సినిమా వార్తలు

దర్శకురాలిగా మారిన రాధికా ఆప్టే

ఉత్తరాదిన.. దక్షిణాదిన కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే. పాత్ర ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ.. మంచి మంచి పాత్రలతో తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఇన్ని రోజులు నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన రాధికా ఆప్టే.. ఇప్పుడు దర్శకురాలిగా మారింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రంగమార్తాండ మూవీ లో అమితాబ్ ?

రెడ్ బల్బ్ మూవీస్, SVR గ్రూప్ , హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్స్ పై ట్యాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీరూపొందుతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న ఈ మూవీ లో వారి తనయ క్యారెక్టర్ కు అవికాగోర్ ఎంపిక అయ్యారు. ఈ మూవీ లీడ్ క్యారెక్టర్ గురువు క్యారెక్టర్ కై బాలీవుడ్ సూపర్ స్టార్ ను దర్శకుడు కృష్ణవంశీ సంప్రదించినట్టుసమాచారం .

Team TFNవాట్సాప్
iSmart Shankar Completes 100 Days,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,iSmart Shankar Movie Completes 100 Days,iSmart Shankar Movie 100 Days,iSmart Shankar Telugu Movie
సినిమా వార్తలు

100రోజులు పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి )నిర్మాణసారథ్యంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. పక్కా హైదరాబాదీ గా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. సత్యదేవ్, పునీత్ ఇస్సార్, అశీష్ విద్యార్థి, షాయాజీ షిండే ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ కి చిరంజీవి ఆతిథ్యం

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అంటే 1980 దశకం లో నటీనటులు అందరూ ప్రతీ సంవత్సరం ఒక చోట రీ యూనియన్ అవడం. మోహన్ లాల్ , చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నరేష్, అర్జున్, జాకీ ష్రాఫ్, ప్రభు, భాగ్యరాజ్, సత్యరాజ్, జయరామ్, సుమన్ , రమ్యకృష్ణ, సుమలత, శోభన , సుహాసిని, రాధిక, ఖుష్బూ, నదియా ఈ టీమ్ లో ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఈ టీమ్ మెంబర్ ఒకరు సభ్యులందరికీ పార్టీ ఎరేంజ్ చేయాలి. వీరందరూ పాల్గొనే ప్రతీ సంవత్సరం పార్టీ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`అసుర‌న్‌` రీమేక్‌లో వెంక‌టేష్‌

విక్ట‌రీ వెంక‌టేష్ ప‌లు రీమేక్ చిత్రాల్లో సంద‌డి చేశారు. వీటిలో సింహ‌భాగం విజ‌యం సాధించాయి కూడా. కాగా... `గురు`(2017) త‌రువాత మ‌రో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు వెంకీ. అదే... త‌మిళ చిత్రం `అసుర‌న్‌`. ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ విలేజ్ డ్రామా త‌మిళ‌నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. అక్టోబ‌ర్ 4న రిలీజైన ఈ సెన్సేష‌న‌ల్ మూవీని వెట్రిమార‌న్ డైరెక్ట్ చేయ‌గా... క‌లైపులి థాను నిర్మించారు. ఇక తెలుగు వెర్ష‌న్‌ని డి.సురేష్‌ బాబుతో పాటు మాతృక నిర్మాత క‌లైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విష‌యాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించింది. వెంక‌టేష్…

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

`స‌రిలేరు నీకెవ్వ‌రు`... విజ‌య‌శాంతి ఫ‌స్ట్ లుక్ అప్‌డేట్‌

లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... కాలేజ్ ప్రొఫెస‌ర్‌గా ఆమె క‌నిపిస్తుంద‌ని తెలిసింది. కాగా, విజ‌య‌శాంతి పాత్ర‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి లుక్‌ రివీల్ చేయ‌ని యూనిట్‌... ఓ స్పెష‌ల్ డే(ట్‌)ని ఇందుకోసం లాక్ చేసింద‌ట‌. ఆ స్పెష‌ల్ డే మ‌రేదో కాదు... దీపావ‌ళి. సో... అక్టోబ‌ర్ 27న విజ‌య‌శాంతి పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ మ‌నం…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాజ‌మండ్రిలో `భీష్మ‌` సంద‌డి

`శ్రీ‌నివాస క‌ళ్యాణం` త‌రువాత నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `భీష్మ‌`. సింగిల్ ఫ‌రెవ‌ర్ అన్న‌ది ఉప‌శీర్షిక‌. `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో నితిన్‌కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న నాయిక‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`దొంగ‌`గా కార్తి?

యువ క‌థానాయ‌కుడు కార్తి తాజా చిత్రం `ఖైదీ` నేడు జ‌నం ముందుకు వ‌చ్చింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో యావ‌జ్జీవ ఖైదీ దిల్లీగా కార్తిగా క‌నిపించాడు. క‌ట్ చేస్తే... త‌న త‌దుప‌రి చిత్రం కూడా థ్రిల్ల‌ర్ బాట‌లోనే వెళ్ళ‌నుంది. అయితే... ఈ సారి ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌తో కార్తి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. `దృశ్యం` మల‌యాళ వెర్ష‌న్‌ని (ఇంకా చెప్పాలంటే ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌) రూపొందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తి వ‌దిన జ్యోతిక ఇందులో అత‌నికి అక్క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స‌త్య‌రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకి సంబంధించిన త‌మిళ టైటిల్ ఇంకా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూరీతో సినిమా చేయడానికి రెడీ..!

ప్రభుదేవా-సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన 'వాంటెడ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లో పోకిరి సినిమాను వాంటెడ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా పెద్ద సక్సెస్ కొట్టారు ప్రభుదేవా-సల్మాన్. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించిన దబాంగ్ మూవీ ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 కూడా వచ్చింది. ఇప్పుడు దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 రూపొందింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

బాలకృష్ణ 105 మూవీ - ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఎలాగూ డిసెంబర్ లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సాంగ్

'మీకు మాత్రమే చెప్తా' విజయ్ స్పెషల్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజులు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న వీరు ఇప్పుడు వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టు తెలుస్తుంది టీజర్, ట్రైలర్ ను చూస్తుంటే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'శివన్' ట్రైలర్ రిలీజ్

శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ డిజిటల్ వ్యూస్‌ని రాబట్టింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Raju Gari Gadhi 3 Movie In Safe Zone,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Raju Gari Gadhi 3 Movie,Raju Gari Gadhi 3 Telugu Movie,Raju Gari Gadhi 3 Movie Latest News
సినిమా వార్తలు

సేఫ్ జోన్ లో 'రాజు గారి గది3'

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'రాజు గారి గది3' సినిమా ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గానే వస్తున్నాయి. మూడు రోజుల్లో 3.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి వీకెండ్ లో 70% రికవరీ చేసింది. మూడు రోజులకి మూడున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఐదు రోజులకుగాను రూ.4.7 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్లను రాబట్టింది. ఇక నిన్నటి వసూళ్లను కూడా కలిపితే ఈ మొత్తం రూ.6 కోట్లకు చేరుకొని సేఫ్ జోన్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Karthikeya 2 Movie Sequel Shoot Begins,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar,Karthikeya 2 Movie Sequel,Karthikeya Movie Sequel Shoot,Karthikeya 2 Movie Updates,Nikhil Karthikeya 2 Movie
సినిమా వార్తలు

'కార్తికేయ' సీక్వెల్ కు రంగం సిద్ధం

చందు మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఇన్ని రోజులు స్క్రిప్ట్ తో కసరత్తులు చేసిన చందూ ఇప్పుడు ఫైనల్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలిసింది.

TFN Adminవాట్సాప్
సెన్సార్ పూర్తిచేసుకున్న 'విజిల్'
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'విజిల్'

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను అందించారు.

TFN Adminవాట్సాప్

షేర్