ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 21
`సరిలేరు నీకెవ్వరు` లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్
నక్సలిజమ్ నేపథ్యంలో చిరు 152?
అశ్వమేథం ఫస్ట్ ఫిలిం - నాకు తెలుగే రాదు..!
'సాహో ది గేమ్' వీడియో గేమ్ త్వరలో
హీరో రెమ్యునరేషన్ మా సినిమా బడ్జెట్

రాజీనామాల బాటలో మరికొందరు కౌన్సిల్ ఈసీలు

కత్తి తమిళ మూవీ బాలీవుడ్ రీమేక్

వెంకీ మామ మూవీ లో భారీ యాక్షన్ సీన్
బన్నీకి సోదరిగా క్రేజీ హీరోయిన్?
డీఎస్పీకి బర్త్ డే గిఫ్ట్... `రాక్షసుడు`

మహి.వి.రాఘవ్ సిండికేట్ వెనుక సీక్రెట్ ఏంటో?
యన్టీఆర్ టైటిల్స్‌తో కొత్త చిత్రాలు

చిరు, చరణ్... నాలుగోసారి

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరు, కొరటాల మూవీ ?

నేషనల్ వైడ్ గా ప్రభాస్ టూర్

పూరీ 'జనగణమన'లో కే.జీ.ఎఫ్ హీరో..?
వారం గ్యాప్‌లో వస్తున్న `జబర్దస్త్` బ్యూటీస్
`జబర్దస్త్` టీవీ షోతో పాపులర్ అయిన అనసూయ, రష్మి... ఇప్పుడు వెండితెరపైనా తమదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కీలక పాత్రల్లో నటిస్తూనే... మరో ప్రధాన పాత్రల్లోనూ సందడి చేస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీస్. కాగా... ఈ `జబర్దస్త్` భామలు నటించిన కొత్త చిత్రాలు వారం గ్యాప్‌లో రానుండడం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు... ఈ రెండు సినిమాలు కూడా థ్రిల్లర్ మూవీస్ కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే... రష్మి ప్రధాన పాత్రలో నటించిన `శివరంజిని` ఈ నెల 2న విడుదల కానుండగా... అనసూయ లీడ్ రోల్‌లో నటించిన `కథనం` ఈ నెల 9న రాబోతోంది. మరి... వారం గ్యాప్‌లో వస్తున్న ఈ…
`సరిలేరు నీకెవ్వరు` లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక నటిస్తుండగా... ఓ శక్తిమంతమైన పాత్రలో విజయశాంతి దర్శనమివ్వనుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారీ ట్రైన్ సెట్‌లో మహేష్, రష్మిక, రాజేంద్రప్రసాద్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. కాగా... ఈ షెడ్యూల్ ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని తెలిసింది. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో…
పాట పాడుకుంటున్న `వెంకీమామ`
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ `వెంకీ మామ`. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి థమన్ సంగీతమందిస్తున్నాడు.
నక్సలిజమ్ నేపథ్యంలో చిరు 152?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 22న ప్రారంభం కానుంది. నవంబర్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
అశ్వమేథం ఫస్ట్ ఫిలిం - నాకు తెలుగే రాదు..!
నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'సాహో ది గేమ్' వీడియో గేమ్ త్వరలో
మొత్తానికి సాహో టీమ్ ఫ్యాన్స్ కు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తుంది. నెల రోజుల కౌంట్ డౌన్ స్టార్ అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే టీజర్, పాటలు, పోస్టర్లతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఇస్తున్న టీమ్.. తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.
100 కోట్లు కొల్లగొట్టబోతున్న ఇస్మార్ట్ 'పూరీ'శంకర్
సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా వెలిగిన, ఎదిగిన సుప్రసిద్ధ దర్శకుడు పూరి జగన్నాథ్ తో అదే సక్సెస్ చాలా కాలంగా దోబూచులాడింది. టెంపర్ తరువాత జ్యోతిలక్ష్మి, లోఫర్, రోగ్, పైసా వసూల్, మెహబూబా వంటి చిత్రాలు తన నుండి వచ్చినప్పటికీ ఏ ఒక్కటీ సంతృప్తికరమైన విజయాన్ని అందించలేకపోయింది. కెరీర్ పరంగా, ఇమేజ్ పరంగా తనకు ఒక సక్సెస్ must and should అయిన తరుణంలో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" పూరి కి పూర్తి స్థాయి విజయ మాధుర్యాన్ని అందించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఒక పెద్ద ప్లాప్ కాంబినేషన్.
హీరో రెమ్యునరేషన్ మా సినిమా బడ్జెట్
జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో మిషన్ మంగళ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు పలు ప్రెస్ మీట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు.

రాజీనామాల బాటలో మరికొందరు కౌన్సిల్ ఈసీలు
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు పరిశ్రమలో భిన్న స్వరాలకు ఆజ్యం పోస్తున్నాయి. అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ లేకుండా నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ లలో కీలక నిర్ణయాలు తీసుకోవటం, విధి విధానాలు రూపొందించుకోవడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని భావిస్తూ చాలా మంది సభ్యులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి మన ప్యానల్ సభ్యులు అధిక సంఖ్యలో గెలిచినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్స్ నుండిమద్దతు లభించడంతో ఫిలిం చాంబర్ కు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుండి దిల్…

కత్తి తమిళ మూవీ బాలీవుడ్ రీమేక్
AR మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన కత్తి తమిళ మూవీ 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. కత్తి మూవీ తెలుగు రీమేక్ ఖైదీ నెం 150 మూవీ మెగా స్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా రూపొంది రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతమైంది. ఇప్పుడు కత్తి తమిళ మూవీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా హిందీ లో రీమేక్ కానుంది. హీరో అక్షయ్ కుమార్ పలు దక్షిణాది మూవీస్ రీమిక్స్ లలో నటించి విజయాలు సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే.

వెంకీ మామ మూవీ లో భారీ యాక్షన్ సీన్
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై KS రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ దసరా పండుగ కు రిలీజ్ కానుందని సమాచారం. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. వెంకీ మామ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
బన్నీకి సోదరిగా క్రేజీ హీరోయిన్?
మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్. అందం, అభినయం, తో పాటు టాలెంట్ కూడా ఉండడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లే దక్కుతున్నాయి. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ.
డీఎస్పీకి బర్త్ డే గిఫ్ట్... `రాక్షసుడు`
ప్రస్తుతం తెలుగునాట నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. అలాంటి డీఎస్పీకి, ఆయన అభిమానులకు ఆగస్టు 2 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... ఆ రోజు దేవిశ్రీ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాది ఆగస్టు 2తో ఈ యువ సంగీత సంచలనం 40 వసంతాలను పూర్తిచేసుకుంటున్నాడు. అంతేకాదు... ఈ పుట్టినరోజు డీఎస్పీకి వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే... అదే రోజున దేవిశ్రీ తమ్ముడు, గాయకుడు సాగర్... రచయితగా తొలి అడుగులు వేసిన `రాక్షసుడు` సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళ చిత్రం `రాట్చసన్`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్…

2020 వేసవిలో `ఆ నలుగురు` అగ్ర కథానాయకుల సందడి
తెలుగు సినీ ప్రియులకు సంబంధించినంత వరకు... వేసవి అంటే వినోదాల విందు. ముఖ్యంగా... ఈ సీజన్‌లో ప్రతీ ఏడాది ఏదో ఒక అగ్ర కథానాయకుడి సినిమా సందడి చేస్తుండడం ఆనవాయితీగా మారింది. అయితే... 2020 వేసవి మాత్రం వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే... నలుగురు సీనియర్ స్టార్స్ 2020 సమ్మర్‌లో తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. ఆ స్టార్సే... మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.

మహి.వి.రాఘవ్ సిండికేట్ వెనుక సీక్రెట్ ఏంటో?
ఆనందో బ్రహ్మ లాంటి కామెడీ హార్రర్ తో మంచి హిట్ కొట్టి... వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత యాత్ర సీక్వెల్ యాత్ర 2 సినిమా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తీయడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
యన్టీఆర్ టైటిల్స్‌తో కొత్త చిత్రాలు
తెలుగునాట మహానటుడు నందమూరి తారక రామారావుది చిరస్మరణీయ ప్రస్థానం. అందుకే... యన్టీఆర్ నటించిన చిత్రాలే కాదు టైటిల్స్ కూడా టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్. నాటి అగ్ర కథానాయకులు ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొదలుకుని నేటి తరం అగ్ర కథానాయకుడు ప్రభాస్ వరకు... అంటే మూడు తరాల స్టార్ హీరోలు ఆయన పాత చిత్రాల టైటిల్స్‌తో కొత్త చిత్రాల్లో సందడి చేశారు.

చిరు, చరణ్... నాలుగోసారి
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా... ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 ఉగాదికి రిలీజ్ కానుందని టాక్.

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరు, కొరటాల మూవీ ?
ప్రతిష్టాత్మక మూవీ సైరా నరసింహా రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటించనున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. చిరంజీవి యువకుడు, మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా నటించే ఈ మూవీ ఆగస్ట్ 22 వ తేదీ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

నేషనల్ వైడ్ గా ప్రభాస్ టూర్
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఈసినిమా నుండి పాటలను, పోస్టర్లను రిలీజ్ చేస్తూ అభిమానులను కూల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా, అందులోనూ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం చాలా భారీగా చేయనున్నారు.

పూరీ 'జనగణమన'లో కే.జీ.ఎఫ్ హీరో..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్య జనగణమన సినిమా వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. కానీ తర్వాత రకకరకాల కారణాలతో ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.