
ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 22

'సూపర్ డీలక్స్' రిలీజ్ కు అడ్డంకిగా సామ్

బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్

రానా నిర్మాతగా ప్రముఖ క్రికెటర్ బయోపిక్

రష్మిక తమిళ మూవీ ఆగస్ట్ లో ప్రారంభం
అంచనాలను పెంచుతున్న అశ్వమేథం
అఖిల్ సరసన నాని హీరోయిన్!?

కాజల్ అగర్వాల్ ప్రయోగాత్మక మూవీ
సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`

పల్లెటూరి దొరబాబు గెటప్

లేటెస్ట్ అప్ డేట్స్ కోసం 'తెలుగు ఫిలింనగర్ యాప్'

ఘనంగా `రాజ్ ధూత్` ప్రీ రిలీజ్ ఈవెంట్!
జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్

తెలుగు, తమిళ మూవీస్ షూటింగ్స్ లో బిజీ

"శ్రీకారం " చుట్టిన శర్వానంద్

రాజ్ దూత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
రానా తో గుణశేఖర్ - హిరణ్య కశిప అప్ డేట్

మురళీమోహన్ ను పరామర్శించిన చిరంజీవి

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ పదవికి చదలవాడ శ్రీనివాసరావు రాజీనామా
ఇటీవల జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు చిత్ర పరిశ్రమలో దుష్ఫలితాలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రాజీనామాతో బలం చేకూరింది. కేవలం సంఖ్యాబలంతో కౌన్సిల్లో పదవులు చేజిక్కించుకున్న ప్పటికీ అక్కడ క్రియాశీలకంగా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కౌన్సిల్ పగ్గాలను యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు అప్పగించాలి అనే అంగీకారానికి అందరూ వచ్చారు.
'సూపర్ డీలక్స్' రిలీజ్ కు అడ్డంకిగా సామ్
వివాహానంతరం కూడా వరుస విజయాలతో దూసుకుపోతుంది సమంత. రంగస్థలం, మహానటి, యూటర్న్, సూపర్ డీలక్స్, ఇటీవల విడుదలైన ఓ బేబి ఇలా అన్ని సినిమాలు మంచి విజయం సాధించింది. ప్రస్తుతం 96 సినిమా రీమేక్ లో నటిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సబ్జెక్ట్ లతో రావాలని ప్లాన్ చేస్తుంది సమంత.

బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్
కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో సోనాల్ చౌహాన్‌తో జతకట్టాడు బాలయ్య. ఇప్పుడు మూడోసారి నటించనున్నాడు. ఇదిలా ఉండగా భూమిక కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

రానా నిర్మాతగా ప్రముఖ క్రికెటర్ బయోపిక్
సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలిసిందే. తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఈ బయోపిక్ ను రూపొందించనున్నారు. థార్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రంగస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారట.

రష్మిక తమిళ మూవీ ఆగస్ట్ లో ప్రారంభం
బ్లాక్ బస్టర్ మూవీ కిరిక్ పార్టీ తో శాండల్ వుడ్ లో అడుగుపెట్టిన రష్మిక నటించిన అంజనీపుత్ర, చమక్ కన్నడ మూవీస్ విజయం సాధించాయి.బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రష్మిక గీతగోవిందం మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. మల్టీ స్టారర్ దేవదాస్ మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. యజమాన కన్నడ మూవీ ఘనవిజయం సాధించి హీరో దర్శన్ సినీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ తో రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.
అంచనాలను పెంచుతున్న అశ్వమేథం
సైబర్ క్రైం నేపథ్యంలో నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
అఖిల్ సరసన నాని హీరోయిన్!?
యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి గా కనిపించనున్నట్లు సమాచారం. కాగా... ఇందులో అఖిల్ కి జోడిగా 'గ్యాంగ్ లీడర్' చిత్ర కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపికైందని తెలిసింది. త్వరలో ప్రియాంక ఎంట్రీ పై క్లారిటీ రానుంది.

కాజల్ అగర్వాల్ ప్రయోగాత్మక మూవీ
తెలుగు, తమిళ భాషల చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక ప్రయోగాత్మక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ అ లో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ యువతి క్యారెక్టర్ లో నటించిన కాజల్ తన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘రాట్చసన్’(2018)కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా...ఘిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.

పల్లెటూరి దొరబాబు గెటప్
ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘజంటగా , నిజ సంఘటనల ప్రేరణ తో రూపొందిన యాక్షన్ డ్రామా గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మించిన గుణ 369 మూవీ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సాయికుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో పూర్ ఓటింగ్ - బట్ రేర్ మెజారిటీస్
నిర్మాతల సమస్యల పరిష్కారం, నిర్మాతల సంక్షేమ సాధన అనే లక్ష్యాలతో పని చేయవలసిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది. నిత్య అసంతృప్తి, నిత్య అసమ్మతి వాదం, నిత్య వివాదం నిత్య కృత్యమైన నిర్మాతల మండలి ఎన్నికలు నిన్న జరిగాయి. దాదాపు 1500 మంది సభ్యులున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో కేవలం 477 ఓట్లు మాత్రమే పోల్ అవ్వటం మండలిలోని అభిప్రాయభేదాలకు, అనైక్యతకు అద్దం పడుతుంది. ఏది ఏమైనా నిన్నటి ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ కావటం గమనార్హం. ఇటీవల జరిగిన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో మాదిరిగానే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో కూడా War and Victory ఏకపక్షం…

లేటెస్ట్ అప్ డేట్స్ కోసం 'తెలుగు ఫిలింనగర్ యాప్'
స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైన కొద్దీ.. యాప్స్ కూడా ఎక్కవగానే వస్తున్నాయి. గూగుల్ స్టార్ లో రోజుకో యాప్ దర్శనమిస్తుంది. అన్ని యాప్స్ ఉపయోగపడకపోయినా.. కొన్ని యాప్స్ మాత్రం మనకు ఉపయోగపడుతుంటాయి. అలాంటి ఉపయోగపడే యాపే 'తెలుగు ఫిలింనగర్ యాప్'. ఇప్పటికే ది తెలుగుఫిలింనగర్.కామ్ అనే పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను ఇస్తున్న తెలుగు ఫిలింనగర్... ఇప్పుడు యాప్ ద్వారా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్, లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్లే స్టోర్ లోకి వెళ్లి తెలుగు ఫిలిం నగర్ యాప్ ను డౌన్…

ఘనంగా `రాజ్ ధూత్` ప్రీ రిలీజ్ ఈవెంట్!
స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్నసాయంత్రం హైదరాబాద్ జెఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా జరిగింది.

తెలుగులోకి సాయిపల్లవి సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’
ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తెలుగులో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆమె మలయాళంలో చేసిన ‘అథిరన్’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.
జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్
నవతరం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో SV రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ జనసేన ఆధ్వర్యంలో నెలకొల్పనున్నామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పలువురు సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకుల పుట్టినిల్లు అయిన పాలకొల్లు లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నెలకొల్పడం, ఆ ఇన్ స్టిట్యూట్ కి దుర్యోధన, రావణ, ఘటోత్కచ, కంస, నరకాసుర, భీష్మ, హిరణ్యకశ్యప వంటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే లెజండరీ నటుడు, నిర్మాత, దర్శకుడు SV రంగారావు పేరుపెట్టడం ముదావహం.

తెలుగు, తమిళ మూవీస్ షూటింగ్స్ లో బిజీ
ఊహలు గుస గుస లాడే వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ , తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇమైక్క నొడిగళ్ సక్సెస్ ఫుల్ తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన అడంగమారు, అయోగ్య మూవీస్ విజయం సాధించాయి.

"శ్రీకారం " చుట్టిన శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా నటించే కొత్త సినిమా ఆదివారం (జూన్ 30వ తేదీ )పూజ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషొర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా శ్రీకారం మూవీ రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టిన శ్రీకారం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభమవుతుంది. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. శ్రీకారం మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

రాజ్ దూత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
MLV సత్యనారాయణ (సత్తిబాబు ) నిర్మాణ సారథ్యంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రియల్ స్టార్ తనయుడు మేఘాంశ్ శ్రీహరి రాజ్ దూత్ మూవీ ద్వారా టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మేఘాంశ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొని హీరోగా ప్రేక్షకులను పలుకరించనున్నారు. అర్జున్ - కార్తీక్ దర్శకత్వంలో మేఘాంశ్, నక్షత్ర జంటగా రాజ్ దూత్ మూవీ రూపొందింది.
రానా తో గుణశేఖర్ - హిరణ్య కశిప అప్ డేట్
రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో పౌరాణిక గాథ “హిరణ్య కశిప” అనే సినిమా తెరకెక్కిస్తున్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమాపై అసలు నిజమా.. రూమర్లు మాత్రమేనా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని… ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని గతంలోనే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్.

మురళీమోహన్ ను పరామర్శించిన చిరంజీవి
ఈనాడు మెగాస్టార్ గా సుప్రసిద్ధులైన చిరంజీవి చిత్ర రంగ ప్రవేశం చేసే నాటికి మురళీమోహన్ ఒక ప్రముఖ హీరో. అయితే హీరోగా వర్ధమాన దశలో ఉన్న చిరంజీవిని మురళీమోహన్ ఎంతగానో ప్రోత్సహించేవారు. అప్పటినుండి బలపడిన వారి అనుబంధంలో ఎన్నెన్నో మధురస్మృతులు ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య చక్కని స్నేహ సంబంధాలు ఉన్నాయి. తన కళ్ళ ముందు వచ్చిన చిరంజీవి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంటే ఎంతో సంతోషించేవారు మురళీమోహన్. అలాగే వృత్తి పరంగా కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన అనుబంధం వీరిది.