సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై KS రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ దసరా పండుగ కు రిలీజ్ కానుందని సమాచారం. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. వెంకీ మామ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ నగర శివార్లలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వం లో 500 మంది జూనియర్ ఆర్టిస్ట్స్, ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీన్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ భారీ యాక్షన్ సీన్ ప్రేక్షకులను అలరించేలా రూపొందనుంది. వెంకీ మామ మూవీ లో వెంకటేష్, నాగ చైతన్య ఫుల్ లెంగ్త్ రోల్స్ లో మొదటిసారి నటిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం. వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల, F 2 మూవీస్ ఘనవిజయం సాధించాయి.
[youtube_video videoid=tpu-lZ3oEUg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)