మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా… ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ఉగాదికి రిలీజ్ కానుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఓ శక్తిమంతమైన అతిథి పాత్ర ఉందని… అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తాడని సమాచారం. అదే గనుక నిజమైతే… `ఖైదీ నంబర్ 150` తరువాత చిరు సినిమాలో చరణ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం ఇదే అవుతుంది. ఓవరాల్‌గా చూస్తే… `మగధీర` (చిరు గెస్ట్), `బ్రూస్ లీ` (చిరు గెస్ట్), `ఖైదీ నంబర్ 150` (చరణ్ గెస్ట్) తరువాత చిరు, చరణ్ కాంబోలో వచ్చే నాలుగో సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే చరణ్ అతిథి పాత్రపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=AamOmkL3KO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























