100 కోట్లు కొల్లగొట్టబోతున్న ఇస్మార్ట్ ‘పూరీ’శంకర్

2019 Latest Telugu Film News, iSmart Shankar Movie to Reach 100 Crore Gross Collections, iSmart Shankar box office collection till now, 100 Crore Gross Collections For iSmart Shankar, iSmart Shankar Movie Total Collections, iSmart Shankar box office collection, Puri film beats lifetime record, 100 Crore Collections To be reached by iSmart Shankar, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా వెలిగిన, ఎదిగిన సుప్రసిద్ధ దర్శకుడు పూరి జగన్నాథ్ తో అదే సక్సెస్   చాలా కాలంగా దోబూచులాడింది. టెంపర్ తరువాత జ్యోతిలక్ష్మి, లోఫర్, రోగ్, పైసా వసూల్, మెహబూబా వంటి చిత్రాలు తన నుండి వచ్చినప్పటికీ ఏ ఒక్కటీ సంతృప్తికరమైన విజయాన్ని అందించలేకపోయింది. కెరీర్ పరంగా, ఇమేజ్ పరంగా తనకు ఒక సక్సెస్ must and should అయిన తరుణంలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” పూరి కి పూర్తి స్థాయి విజయ మాధుర్యాన్ని అందించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఒక పెద్ద ప్లాప్ కాంబినేషన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు పూరి జగన్నాథ్ , హీరో రామ్ పోతినేని, హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ- వీరిలో ఎవ్వరు ఫార్మ్ లో లేరు. ఇలా ఇంతమంది ఫ్లాప్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇంత  పెద్ద హిట్ కావటం చూస్తే sentiments are foolish అనిపిస్తుంది.

ఇక ” ఇస్మార్ట్ శంకర్” పై కురుస్తున్న కలెక్షన్ల కనక వర్షాన్ని చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనిపిస్తుంది.12 రోజుల్లో 29.93 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన ఈ సినిమాపై  పూరి 17 కోట్ల బిజినెస్ చేశారని తెలిసింది. కాగా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ” ఇస్మార్ట్ శంకర్” వసూలు చేసిన డిస్ట్రిబ్యూటర్ షేర్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.

నైజాం                 : 9.92 కోట్లు
సీడెడ్                 :  5.25
నెల్లూరు.             :  1.03
గుంటూరు.          :  1.78
కృష్ణ.                   :  1.85
ఈస్ట్.                   :  1.80
వెస్ట్.                    :   1.55
ఉత్తరాంధ్ర.           :   3.50
రెస్ట్ ఆఫ్ఇండియా:   2.10
ఓవర్సీస్.             :    1.15

టోటల్                —————
  29.93

ప్రజెంట్ రిలీజ్ ల్లో కూడా కాంపిటీషన్ హెవీగా లేకపోవటంతో”ఇస్మార్ట్ శంకర్”
కలెక్షన్ల ఉద్ధృతి ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనితో ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల గ్రాస్ ను టచ్ చేసే అవకాశం ఉందని ఫిలిం ట్రేడ్ అంచనా వేస్తుంది.

So hearty congrats to the Team of  “iSmart Shankar” .

[subscribe]

[youtube_video videoid=NtIgSHeUU6Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =