ఆనందో బ్రహ్మ లాంటి కామెడీ హార్రర్ తో మంచి హిట్ కొట్టి… వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత యాత్ర సీక్వెల్ యాత్ర 2 సినిమా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తీయడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు మహి. ప్రస్తుతం మహీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని తెలుస్తోంది. మంచి లైన్ చెప్పడంతో పివిపి ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్క్రిప్ట్ మీద మహి వర్క్ చేస్తున్నారు. అది పూర్తయితే సినిమా సెట్ మీదకు వెళ్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా మహి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ అప్ డేట్ ఇచ్చాడు. తన తదపరి సినిమా యాక్షన్ డ్రామా అని.. ఆ సినిమా టైటిల్ సిండికేట్ అని కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆ సిండికేట్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
‘SYNDICATE’ pic.twitter.com/6DAyGGqjFf
— Mahi Vraghav (@MahiVraghav) July 30, 2019
[youtube_video videoid=WxixwW2DQ6Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























