అశ్వమేథం ఫస్ట్ ఫిలిం – నాకు తెలుగే రాదు..!

2019 Latest Telugu Film News, Director Nitin G About Ashwamedham Movie, Director Nitin G About Aswamedham Movie, Aswamedham Movie Director Nitin G, Ashwamedham Movie Latest news, Ashwamedham Movie 2019, Director Nitin Speaks About Aswamedham, Director Nitin G Aswamedham Movie Latest Updates, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అశ్వమేథం డైరెక్టర్ నితిన్ ప్రెస్ మీట్ లో పాల్లొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అసలు తెలుగే రాదని.. మా నిర్మాత ప్రోత్సాహంతోనే తెలుగులో ఈ సినిమాకి డైరెక్షన్ చేశానని చెప్పాడు. అంతకు ముందు మరాఠీలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాను.. ఏది డైరెక్ట్ చేయబోతున్నాం, సీన్ లో ఎమోషన్ ఏంటి, అసలు సీన్ ఏంటి అనే అంశాలను క్లారిటీగా అర్ధం చేసుకుంటే చాలు. భాష వచ్చినా చేసే పని అదే కదా. నాకు భాష రాకపోయినా.. నేను ఆ పని చేస్తాను అని చెప్పుకొచ్చారు. మరి తెలుగురాకపోయినా డైరెక్ట్ చేశారంటే అభినందించాల్సిన విషయమే కదా.. మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో.

కాగా ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంకా శివాంగి, సుమ‌న్, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఐశ్వ‌ర్య యాద‌వ్, ప్రియా నాయ‌ర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. జయపాల్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=b1g0PLeomCQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =