రాజీనామాల బాటలో మరికొందరు కౌన్సిల్ ఈసీలు

2019 Latest Telugu Film News, Telugu Film Chamber Council ECs Resign in Support of Active Producers, Telugu Film Chamber Council Updates, Telugu Film Chamber Council ECs Resign, TFC Council ECs Resign, Tollywood Active Producers, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలికి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు పరిశ్రమలో భిన్న స్వరాలకు ఆజ్యం పోస్తున్నాయి. అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ లేకుండా నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ లలో కీలక నిర్ణయాలు తీసుకోవటం, విధి విధానాలు రూపొందించుకోవడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని భావిస్తూ చాలా మంది సభ్యులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.  ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి మన ప్యానల్ సభ్యులు అధిక సంఖ్యలో గెలిచినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్స్ నుండిమద్దతు లభించడంతో ఫిలిం చాంబర్ కు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుండి దిల్ రాజు వైస్ ప్రెసిడెంట్ గా, దామోదర ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కూడా యాక్టీవ్  ప్రొడ్యూసర్స్  క్రియాశీలకంగా ఉన్నప్పుడే కౌన్సిల్అ భివృద్ధి పథంలో సాగుతుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే చిత్ర పరిశ్రమ సంక్షేమ దృష్టితో ప్రొడ్యూసర్ కౌన్సిల్ పగ్గాలను యాక్టీవ్  ప్రొడ్యూసర్స్ కు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఆ మేరకు కౌన్సిల్లో ఎన్నికైన సభ్యులు చాలామంది తమ  పదవులకు రాజీనామా చేసి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడ్డారు కూడా. కానీ చివరి నిమిషంలో కొందరు వ్యక్తుల పదవీ కాంక్ష కారణంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్- ఏక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ల మధ్య సయోధ్యకు గండి పడింది. అందుకు నిరసనగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ట్రెజరర్ పదవికి రాజీనామా చేయటం ఫిలిం ట్రేడ్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామా నిర్ణయంపై ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకొనవలసి ఉండగా ఆ మీటింగ్ అనివార్య కారణాల వల్లరేపటికి వాయిదా పడింది.ఈ లోపల మరికొంతమంది ఈసీ మెంబర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో తమ పదవులకు రాజీనామా  చేసేందుకు సిద్ధపడుతున్నట్లుగాతెలిసింది. రేపు జరగనున్న కౌన్సిల్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ తరువాత పరిస్థితులు, పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.

మొత్తానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సంఖ్యా బలం ఉన్న “ఇనాక్టివ్   ప్రొడ్యూసర్స్ “కు సామర్ధ్య బలం ఉన్న”యాక్టీవ్  ప్రొడ్యూసర్స్” కు మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏ పరిణామాలకు దారితీస్తుందో let’s wait and see.

[subscribe]

[youtube_video videoid=rW-jaUtIDVA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.