'శేఖర్' ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్
'గరుడ వేగ', 'కల్కీ' లాంటి సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలను చేస్తున్నాడు. రాజశేఖర్ హీరోగా లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'శేఖర్'. ఆమధ్య షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
పూర్తి వార్త చదవండి


















