‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ పాటను.. పలు పోస్టర్లు రిలీజ్ చేయగా రీసెంట్ గానే దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి హీరోయిన్స్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అవి సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు అంచనాలు కూడా పెంచేసింది. ఈసినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 18న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for the Vigorous Action & Eruptive Rage of a Majestic Man! ✊🏻💥#ShyamSinghaRoy🔱 Teaser on Nov 18th!📝✨#SSRTeaser 🔥
Natural 🌟 @NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @NiharikaEnt @SSRTheFilm #SSRonDEC24th 💥 pic.twitter.com/HOjgiB83lY
— Niharika Entertainment (@NiharikaEnt) November 11, 2021
కాగా 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాలో నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇంకా రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: