న్యాచురల్ స్టార్ నాని హీరోగా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాలుగు భాషల్లో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ టీజర్ రిలీజ్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ లో ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్’’ అంటూ శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక సాయి పల్లవి కూడా ఉగ్రరూపంతో చాలా పవర్ఫుల్ పాత్రతో కనిపిస్తుంది. పురాణకాలంలోని ఆచారాల వలన స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక ఆ తర్వాత ఒక చదువుకున్న వ్యక్తి వారిని ఏ విధంగా ఆ దేవుడి నుంచి రక్షించాడు అనే పాయింట్ కూడా హైలెట్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి టీజర్అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
Khobordaarrrr
DECEMBER 24th 🔥#SSRTeaser #SSRonDEC24thTelugu – https://t.co/ctKMZcyFye
Tamil – https://t.co/icScRgswr9
Malayalam – https://t.co/sc35iChRzx
Kannada – https://t.co/s4qpUyQ37y#ShyamSinghaRoy pic.twitter.com/Sh03ubMg8Y— Nani (@NameisNani) November 18, 2021
కృతిశెట్టి, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
మరి కరోనా వల్ల థియేటర్లు లేకపోవడంతో నాని తన వి సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేశాడు. ఈమధ్య వచ్చిన టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. రెండు సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలయ్యాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా మాత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దీంతో ఈసినిమాపై గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: