ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
పూర్తి వార్త చదవండి


















