ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కు ముందు ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ రిలీజ్ తరువాత ఆ అంచనాలను మాత్రం అందుకోలేకోయింది ఈసినిమా. దీంతో వరుణ్ కు ఈసారి కూడా సరైన విజయం అందలేదు. ఇక సినిమా హిట్ అయితే ఓకే కానీ కాస్త అటూ ఇటూ అయితే వెంటనే ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలో కి వచ్చేస్తుంది. రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకోగా ఈనెల24వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఆపరేషన్ వేలంటైన్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసింది. కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈసినిమాను డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: