గత నెలలో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది బేబి.లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టింది.నిర్మాత లెక్కల ప్రకారం ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వస్తుంది.ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా ఈసినిమా ను ఈనెల 25నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.అయితే ఆహా గోల్డ్ సభ్యత్వం కలిగిన సబ్ స్క్రైబర్స్ మాత్రం ఈనెల 24 సాయంత్రం 6గంటల నుండే చూసేయొచ్చు.ఇక మరి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న బేబి ఓటిటి లో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేశాడు.వైష్ణవి చైతన్య కు ఇదే మొదటి సినిమా.దాంతో వైష్ణవి తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. బేబికి విజయ్ బుల్గనిన్ సంగీతం అందించగా ఎస్ కె ఎన్ నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























