డైరెక్ట్ ఓటీటీ లోకి నిత్యామీనన్ కుమారి శ్రీమతి

nithya menen next kumari srimathi will release in amezon prime video

సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకునే వారిలో యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఎప్పుడూ ముందుంటది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టొచ్చు కానీ హడావుడిగా ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసేయాలి అని చూసే రకంకాదు. తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. అలా తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల్లో నటించి టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో భీమ్లానాయక్, తిరు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉంది నిత్యామీనన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో ఒక సినిమానే కుమారి శ్రీమతి. గోమతేష్ ఉపాధ్యాయ్‌ దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాా నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో త్వరలో ఓటీటీలోకి రాబోతుందని తెలుపుతూ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా ఎర్లీ మూన్ సూన్ టేల్స్ అనే బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. వెబ్ ప్రాజెక్ట్స్ నిర్మించడం కోసం వైజయంతీ మూవీస్ వారు ఎర్లీ మూన్ సూన్ టేల్స్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ రచయితగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =