రేపటి నుండి ఓటిటిలో స్లమ్ డాగ్ హస్బెండ్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Slum Dog Husband Telugu Movie To Be Out On Amazon Prime From Tomorrow

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఇందులో ప్రణవి మానుకొండ హీరోయిన్ కాగా.. బ్రహ్మాజీ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించరు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ సునీల్, అలీ, సప్తగిరితో పాటు చంద్ర, యాదమరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పిరెడ్డి నిర్మాత కాగా, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఏఆర్ శ్రీధర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇక పూర్తి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జులై నెలలో విడుదలై మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఈ క్రమంలో ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ గురువారం నుండి ఓటిటిలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమా కథ ఏంటంటే..?

లక్ష్మణ్ (హీరో సంజయ్ రావు) అనే యువకుడు తన తల్లితో కలిసి ఒక బస్తీలో జీవిస్తుంటాడు. అయితే తాను చిన్నప్పటినుంచీ ఇష్టపడిన మౌనిక (ప్రణవి)తో ప్రేమలో ఉంటాడు. ఇరువురూ పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమవుతారు. అయితే పెళ్లికి ముందు జాతకంలో ఉన్న ఒక దోషం వలన ముందుగా ఒక కుక్కకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చెప్తారు. దీంతో ఒక కుక్కని తెచ్చి హీరోకి పెళ్లి జరిపిస్తారు. అది కూడా ఇలా అలా కాదు, ధూమ్ ధామ్ గా చేస్తారు. దీని తర్వాత తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవటానికి హీరో రెడీ అవుతాడు. కానీ ఇక్కడే ఎవరూ ఊహించని ఒక చిక్కు వచ్చి పడుతుంది. అదేంటంటే..? హీరోకి కుక్కతో పెళ్లి అయింది కాబట్టి.. ముందుగా దానికి విడాకులు ఇవ్వాలని ఆ కుక్క యజమాని షరతు పెడతాడు. ఈ క్రమంలో కోర్టులో ఈ కేసు వాదనలు, ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇంతకీ ఈ కేసు ఏమైంది, ఎవరి పక్షాన తీర్పు వచ్చింది? కుక్కతో జరిగిన పెళ్లికి విడాకులు మంజూరయ్యాయా, హీరో తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడా?.. ఇవన్నీ తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రేపటి నుండి స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.