తెలుగు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఛత్రపతి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.ఇది వచ్చిన 18సంవత్సరాల తరువాత దీన్ని హిందీ లో అదే టైటిల్ తో రీమేక్ చేశారు.యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో హీరోగా హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యింది.అయితే రిజల్ట్ ను పక్కన పడితే ఎట్టకేలకు ఈసినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది.జీ 5 ఈసినిమాను రేపటి నుండి స్ట్రీమింగ్ లోకి వస్తుంది.ప్రముఖ తెలుగు డైరెక్టర్ వి వి వినాయక్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయగా నుశరత్ బరూచా హీరోయిన్ గా నటించింది.శరద్ కేల్కర్ విలన్ పాత్రలో కనిపించాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందించాడు.పెన్ స్టూడియోస్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత సాయి శ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాల మీద దృష్టిపెట్టాడు.అందులో భాగంగా ప్రస్తుతం తన 10వ సినిమాలో నటిస్తున్నాడు.భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ ఆచంట,గోపిచంద్ అంచంట నిర్మిస్తున్నారు. త్వరలో ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























