అయోధ్య రాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా, ఫోటోలు వైరల్
ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుత హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనాస్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ రాముడి మందిరాన్ని సందర్శించారు. ఈ మేరకు బుధవారం అయోధ్య రామాలయం వద్దకు వచ్చిన ప్రియాంక.. భర్త, నిక్ జోనాస్ మరియు కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌లతో కలిసి రామ్ లల్లా (బాల రాముడి)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
పూర్తి వార్త చదవండి


















