గుంటూరు కారం, శ్రీలీల డ్యాన్స్‌పై క్రికెటర్ అశ్విన్ కామెంట్స్ వైరల్

Cricketer Ashwin Praises Sreeleela's Dancing Skills in Mahesh Babu's Guntur Kaaram

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘గుంటూరు కారం’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది. అనంతరం ఫిబ్రవరి 09న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌ అయితే కొన్ని వారాలపాటు నెట్టింటిని షేక్ చేసింది. ఇండియాలోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్‌గా ఈ ఊరమాస్‌ సాంగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కు పైగా రీల్స్‌ చేశారంటే ఈ సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాపై టీమిండియా క్రికెట‌ర్, స్టార్ స్పిన్నర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. “మహేష్ బాబు మూవీ గుంటూరు కారం సినిమా తప్పకుండా చుడండి. ముఖ్యంగా మూవీలో ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్‌లో శ్రీలీల, మహేష్ బాబు డ్యాన్స్‌ భయంకరంగా ఉంది. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం, శ్రీలీల డ్యాన్స్‌ అని టైప్‌ చేస్తే వ‌స్తుంది. ఇందులో మ‌హేష్‌ బాబు, శ్రీలీల పోటీప‌డి డ్యాన్సులు చేశారు. హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అదరగొట్టింది” అని శ్రీలీలను ఆకాశానికైతేశారు అశ్విన్.

ఇంకా ఆయన హీరో మహేష్ గురించి మాట్లాడుతూ.. “మహేష్ బాబు కూడా ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్సర్‌. మీ పేవ‌రేట్ లిస్టులో ఆయన త‌ప్ప‌క యాడ్ అవుతాడు. ఇక ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీమ్‍కు మంచి ఊపు తీసుకొస్తుంది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం గుంటూరు కారం మూవీపై అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =