టాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన గీతా ఆర్స్ట్ పెద్ద సినిమాలే కాదు కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే పలు చిన్న సినిమాలను నిర్మించి హిట్లను అందుకోగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే ఈసినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెడుతున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఇక టైటిల్ ను ఎలా విభిన్నంగా ప్రకటించారో ఫస్ట్ సింగిల్ అప్ డేట్ కూడా అలానే ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ ఇచ్చారు.
ఆయ్! మా మొదటి పాట వచ్చేత్తందండి.. పాడింది ఎవరంటే?🎙
తెలుసుకోవాలంటే: https://t.co/onT1WRAXCK
Let’s begin #AAYMovie Musical promotions with refreshing melody #Sufiyana ❤️✨️
Full Lyrical on March 20th @ 11 AM🤩
A @Ram_Miriyala Musical 🎹 pic.twitter.com/r7FDvEAJ9s
— Geetha Arts (@GeethaArts) March 16, 2024
కాగా ఈసినిమానుఅల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: