ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రానున్న సర్ ప్రైజింగ్ అప్ డేట్

unexpected update from ustaad bhagat singh movie

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకూ పూర్తి చేసుకుంది కూడా. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ లకు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతున్నట్టు మేకర్స్ రెండు రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసందే కదా. దానికి తోడు తాజాగా మరో అప్ డేట్ తో వచ్చారు. ఎక్స్‌పెక్ట్ ది అన్‌‍ ఎక్స్‌పెక్టెడ్ మార్చి 19వ తేదీన రాబోతుంది అంటూ మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈసందర్బంగా ఫొటోలు కూడా పోస్ట్ చేయగా అందులో.. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సెషన్‌లో పాల్గొన్న ఫొటోలు కనిపించాయి. దీంతో ఫ్యాన్స్ అప్పుడే టీజర్ గానీ స్పెషల్ గ్లింప్స్ కానీ అయి ఉండొచ్చు అన్న అభిప్రాయానికి వచ్చేశారు. మరి ఆ ఎక్స్‌పెక్ట్ ది అన్‌‍ ఎక్స్‌పెక్టెడ్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 14 =