యంగ్ హీరో ఆశిష్ మాత్రం వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అందులో లవ్ మీ సినిమా కూడా ఒకటి. హార్రర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమవుతుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. భయాన్ని వినడానికి రెడీ నా అంటూ ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
#LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆’ audio on @TSeries. Music lovers are in for a unique musical treat ❤️🔥
Music by Oscar Award winning @mmkeeravaani ✨
First Single soon 💥💥#GhostLove 💘@AshishVoffl @iamvaishnavi04 @pcsreeram #ArunBhimavarapu @artkolla @HR_3555… pic.twitter.com/SC5szw4K8U
— Dil Raju Productions (@DilRajuProdctns) March 19, 2024
కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























