స్టార్ హీరో సూర్య,లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.వీరిద్దరి కాంబోలో ఇంతకుముందు సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా ) అనే సినిమా వచ్చింది.ఈసినిమా థియేటర్లలో విడుదలకాలేదు కానీ ఓటిటి లోమాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.విమర్శకుల ప్రశంసలు పొందడం తోపాటు పలు అవార్డులను కూడా ఖాతాలో వేసుకుంది.ఇక ఇప్పుడు మరో సారి వీరి కాంబినేషన్ అనే సరికి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూరరై పోట్రు తరువాత వీరి కాంబినేషన్ లో సూర్య 43 తెరకెక్కనుంది.ఈసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక వారి కోసం మేకర్స్ ఈసినిమా గురించి అధికారికంగా అప్డేట్ ఇచ్చారు.ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది.ది బెస్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమా ఆలస్యం అవుతుంది.అతి త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు.
#Suriya43 #Puranaanooru @Suriya_offl pic.twitter.com/343EMc2YsJ
— Sudha Kongara (@Sudha_Kongara) March 18, 2024
ఈసినిమాలో దుల్కర్ సల్మాన్,విజయ్ వర్మ ,నజరియా కీలక పాత్రల్లో నటించనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.ఇక ప్రస్తుతం సూర్య కంగవ తో బిజీ గా వున్నాడు.శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా ను పూర్తి చేసి సూర్య తన 43వ సినిమాలో జాయిన్ కానున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: